Pension: రిటైర్మెంట్ తర్వాత బిందాస్‎గా.. నెలకు రూ. 12వేల పెన్షన్ పొందాలంటే.. ఈ బెస్ట్ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే

Mon, 16 Dec 2024-6:44 pm,

LIC Saral Pension Yojana: ఎల్ఐసీలోని స్కీములు అంటే చాలా మందిలో మంచి నమ్మకం ఉంటుంది. ఎందుకంటే  వాటిలో పెట్టుబడి పెట్టిన తర్వాత ఆదాయం  కూడా చాలా బాగుంటుంది. దీని కారణంగా, దేశవ్యాప్తంగా ప్రజలు ఎల్‌ఐసి పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. LIC లో బెస్ట్ స్కీములు ఎన్నో ఉన్నాయి. అందులో LIC సరళ్ పెన్షన్ ప్లాన్ ఒకటి. ఇది నాన్-లింక్డ్, సింగిల్ ప్రీమియం, వ్యక్తిగత తక్షణ యాన్యుటీ పథకం. ఇందులో మీరు ఒకసారి పెట్టుబడి పెట్టాలి. LICలోని  ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

మీరు మీ భార్య/భర్తతో లేదా ఒంటరిగా ఉన్నా ఎల్ఐసీ  సరళా పెన్షన్ ప్లాన్ తీసుకోవచ్చు. ఇందులో మీరు ఒకసారి పెట్టుబడి పెట్టాలి. దీని తర్వాత మీరు మీ జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటారు. మీరు పాలసీ ప్రారంభించిన నాటి నుండి ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు.

ఎల్‌ఐసి సరళ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి, కనీస వయస్సు 40 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 80 సంవత్సరాలు ఉండాలి.   

ఈ స్కీములో ఇన్వెస్ట్ చేసే వ్యక్తి నెలలవారీ,  త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక పెన్షన్‌ను పొందే అవకాశం ఉంటుంది. నెలవారీ పెన్షన్ కనిష్టంగా రూ. 1,000, త్రైమాసిక పెన్షన్ కనిష్టంగా రూ. 3,000, అర్ధ వార్షిక పింఛను కనిష్టంగా రూ. 6,000  వార్షిక పెన్షన్ కనిష్టంగా రూ. 12,000 పొందవచ్చు.  

ఈ స్కీములో మీరు గరిష్ట పెన్షన్ మొత్తంపై ఎలాంటి లిమిట్ లేదు.  మీకు 42 ఏళ్లు ఉండి, మీరు రూ. 30 లక్షల యాన్యుటీని కొనుగోలు చేస్తుంటే, మీకు నెలకు రూ.12,388 పెన్షన్ వస్తుంది. మీరు ఎక్కువ పెన్షన్ పొందాలనుకుంటే, మీరు దాని ప్రకారం పెట్టుబడి పెట్టవచ్చు.   

మీరు ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ ప్రారంభించిన ఆరు నెలల తర్వాత లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అనారోగ్యానికి గురై చికిత్స కోసం డబ్బు అవసరమైతే, మీరు పాలసీలో డిపాజిట్ చేసిన డబ్బును కూడా తీసుకోవచ్చు. కస్టమర్ పాలసీని సరెండర్ చేస్తే, బేస్ ధరలో 95 శాతం రీఫండ్ అవుతుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link