Plant Attracts Snakes: ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే యమడేంజర్.. మీ ఇంటి చుట్టే పాములు తిరుగుతాయట..!
సైప్రస్ ప్లాంట్.. ఈ మొక్క చూడ్డానికి అందంగా ఆకర్షణయంగా కనిపిస్తుంది. కానీ ఈ సైప్రస్ ప్లాంట్ పాములను త్వరగా ఆకర్షితం అవుతాయి. మీ ఇంటి దరిదాపుల్లో ఈ మొక్కలు పెంచకపోవడమే మేలు.
నిమ్మ మొక్క సాధారణంగా వాస్తు ప్రకారం కూడా నిమ్మ మొక్కని ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటారు అయితే పొరపాటున నిమ్మ మొక్కని మీ ఇంటి చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే అక్కడ కచ్చితంగా పాములు ఉంటాయట.
మల్లె మొక్క.. మల్లె మొక్క ఎంతో సువాసనభరితమైంది. దీన్ని ఇంట్లో పరిసర ప్రాంతాల్లో పెంచుకోవడం వల్ల ఆ పరిసర ప్రాంతాలు మొత్తం పరిమళ భరితంగా మారిపోతాయి. అయితే ఈ మల్లె మొక్క వల్ల కూడా పాములు త్వరగా మీ ఇంటికి చుట్టుముట్టు వస్తాయని మీకు తెలుసా?
దానిమ్మ మొక్క.. చాలామంది దానిమ్మ మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అని అంటారు. అయితే ఇది వాస్తు ప్రకారం ఇంటికి శుభాన్ని కలిగిస్తుందని చెబుతారు కానీ ఈ దానిమ్మ మొక్కలకు కూడా పాములు త్వరగా ఆకర్షితం అవుతాయట.
లవంగం.. లవంగం మొక్క ఇంట్లో పెంచుకోవడం వల్ల కూడా పాములు త్వరగా ఆకర్షితం అవుతాయి ఇలాంటి మొక్కలు ఇంట్లో పెంచుకోకపోవడం మేలు.
క్లోవర్ ప్లాంట్ ఈ మొక్క ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుకున్నారంటే పాములు త్వరగా మీ ఇంటి చుట్టూ వచ్చి గుమ్మడి తాయట అందుకే ఈ మొక్క కూడా మీ ఇంటిలో పెంచుకోకండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)