చిత్రమాలిక: ఐకియా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

Fri, 10 Aug 2018-5:18 pm,

IKEA అనే పేరు దాని స్థాపకుడైన ఇంగ్వర్ క్యాంప్రాడ్, ఎల్మెట్రిడ్ (వ్యవసాయ క్షేత్రం పేరు), అగున్నరైడ్ (ఇంగ్వర్ పుట్టిపెరిగిన గ్రామము పేరు) పేర్ల మీదుగా పెట్టబడింది. ఇది 1943లో స్థాపించబడింది.  1985 లో యూఎస్ లో ప్రారంభించబడింది.

I = ఇంగ్వర్- వ్యవస్థాపకుడి మొదటి పేరు K = క్యాంప్రాడ్, వ్యవస్థాపకుడి చివరి పేరు E = ఎల్మెట్రిడ్, స్వీడన్ లో ఇంగ్వర్ పెంచిన వ్యవసాయ క్షేత్రం పేరు A = అగున్నరైడ్,  ఇంగ్వర్ పుట్టిపెరిగిన గ్రామము పేరు

IKEA ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ. ఇంటికి కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులు, ఫర్నిచర్ ఐటెమ్స్ డిజైన్ చేసి అమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా ఐకియా తన ఫర్నిచర్ ను విడిభాగాల (రెడీ టు ఫిట్) రూపంలోనే అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఐకియాకు 49 దేశాల్లో 400కు పైగా స్టోర్లున్నాయి.

అమెరికా జనాభా కంటే రెట్టింపు సంఖ్యలో 2012లో IKEAను 690 మిలియన్ల మంది కస్టమర్లు సందర్శించారు.

IKEA భారత్‌లో తన స్టోర్లను ఏర్పాటు చేయాలనే రూ.10,500 కోట్ల పెట్టుబడుల ప్రణాళికకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపగా.. 2025 కల్లా ఐదు భారతీయ నగరాల్లో 25 స్లోర్లను ప్రారంభించాలని ఐకియా ప్రణాళిక.

ఐకియా భారత్‌లో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌‌ మాదాపూర్‌లో  09 ఆగస్టు 2018న ప్రారంభించింది. ఈ స్టోర్ 13 ఎకరాల్లో విస్తరించింది. రూ.1000 కోట్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేశారు.

మొత్తం 7500 ఉత్పత్తులు ఈ స్టోర్‌లో లభిస్తాయి. ఈ స్టోర్ లో లభించే దాదాపు 1000 ఉత్పత్తులు రూ. 200 లోపే లభించనున్నాయి. ఫర్నిచర్‌, ఇతర వస్తువులను కొనుగోలుదారుల ఇంటికి వెళ్లి బిగించేందుకు అర్బన్‌క్లాప్‌ అనే సంస్థతో ఐకియా ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ మాల్‌లో రెస్టారెంట్ కూడా ఉంది. ప్రపంచంలో అన్ని ఐకియా స్టోర్స్‌లోకెల్లా అతి పెద్ద రెస్టారెంట్ ఇక్కడే ఉంది. 1000 సీట్ల ఈ రెస్టారెంట్‌లో సగం ఆహార పదార్థాలు స్వీడిష్ స్పెషాలిటీస్ కాగా మిగిలిన సగం ఇండియన్ ఆహార పదార్థాలు. ఈ స్టోర్ 365 రోజులూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link