Income Tax – Nirmala Sitaraman: 2025 బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని తొలగిస్తారా? నిర్మలమ్మ నిర్ణయంపై ఉద్యోగుల్లో టెన్షన్?
Income Tax Nirmala Sitaraman: గత కొన్ని బడ్జెట్లలో కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు పెద్దగా తాయిలాలు ప్రకటించలేదు. పైగా 2020 లో తీసుకువచ్చిన కొత్త పన్ను విధానం అందరినీ ఆకట్టుకోలేకపోయింది. అప్పటినుంచి కొత్త పన్ను విధానంలోనే మార్పులు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. పన్ను చెల్లింపుధారులు కొత్త పన్ను విధానం ఎంచుకునేలా ప్రభుత్వం పరోక్షంగా ప్రోత్సహిస్తుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బడ్జెట్లో ప్రభుత్వం పాత పన్ను విధానాన్ని పూర్తిగా ఎత్తివేయనుందా. 2024 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
అయితే త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025-26వ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పన్ను విధానాలపై జోరుగా చర్చ జరుగుతుంది. గత బడ్జెట్లో కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేలా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. అందులో భాగంగా 3 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పూర్తిగా ట్యాక్స్ నుంచి మినహాయింపులు ఇచ్చారు. అయితే అధిక ఆదాయం ఉన్నవారికి గతంతో పోలిస్తే తక్కువ పన్ను రేట్లు విధించారు. కొత్త విధానాన్ని ఎంచుకున్న వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
అయితే పాత పన్ను విధానాన్ని రద్దు చేయడం లేదా సవరించడం అనే అంశంపై ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేదని నిర్మల సీతారామన్ ప్రసంగంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై లోతైన సమీక్ష జరిపిన తర్వాతే ముందుకు వెళ్తామంటూ పేర్కొన్నారు. అధిక ఆదాయం ఉన్న వారి నుంచి మరింత రాబడి పొందే ఉద్దేశంతోనే కొత్త పన్ను విధానంలో మార్పులు చేసినట్లు ఆర్థిక మంత్రి వివరించారు.
పాత పన్ను విధానంలో పన్ను రేట్లు అధికంగా ఉంటాయి. కానీ హెచ్ఆర్ఏ, ఎల్ టి ఏ, హోమ్ లోన్ వడ్దీ, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, సెక్షన్ 80 సి తో సహా పలు రకాల డిడక్షన్లు లభిస్తాయి
2.5 లక్షల వరకు పన్ను ఉండదు. 2.5 లక్షల నుంచి ఐదు లక్షల వరకు అయిదు శాతం పన్ను విధిస్తారు. ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 10 లక్షల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది
కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి. కానీ ఎలాంటి డిడక్షన్లు అందుబాటులో ఉండవు. మూడు లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు అయిదు శాతం టాక్స్ చెల్లించాలి. ఏడు లక్షల నుంచి పది లక్షల 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. పది లక్షల నుంచి 12 లక్షల వరకు ఉంటే 15% , 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20 శాతం, 15 లక్షల కంటే ఎక్కువగా ఉంటే 30% టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
రానున్న బడ్జెట్ పై వేతన జీవులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయాలు భారం అవుతున్న నేపథ్యంలో పన్ను భారం తగ్గించాలని కోరుతున్నారు. ఆ దిశగా రాబోయే బడ్జెట్లో మార్పులు ఉంటాయని చాలామంది ఆశిస్తున్నారు. ఇటీవల పరిశ్రమల సమైక్య సిఐఐ సైతం ఈ దిశగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. 20 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఈసారి పన్ను రేట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొంది.
పన్ను మినహాయింపు పరిమితిని ఏడు లక్షల నుంచి 8 లక్షల వరకు పెంచాలని పలువురు కోరారు. అలాగే స్టాండర్డ్ డిటెక్షన్ 75 వేల నుంచి లక్ష వరకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏడు లక్షల నుంచి 15 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రేట్లలో ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే సెక్షన్ 80c పరిమితిని 1.5 లక్షల నుంచి రెండు లక్షల వరకు పెంచాలని కోరుతున్నారు.