G20 Summit: ఇండియాలో జీ20 సమ్మిట్ జరిగే వేదిక చూశారా, ఇంద్ర భవనాన్ని తలదన్నే నిర్మాణం
సెప్టెంబర్ 9-10 మధ్య జరిగే 18వ జీ20 శిఖరాగ్ర సమావేశం ఇక్కడే జరగనుంది.
ఈ కాంప్లెక్స్ ప్రారంభం జూలై 26న జరగనుంది. ఈ కాంప్లెక్స్ పునరుద్ధరణ పనుల్ని ఎన్ బీసీసీకు అప్పగించారు.
ఐఈసీసీకు వచ్చే అతిధుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడ ఒకేసారి 5500 వాహనాల పార్కింగ్ ఉంటుంది.
ఐటీపీవో కాంప్లెక్స్‌లోని ప్రదర్శన హల్ చాలా బాగుంటుంది. బిజినెస్ డెవెలప్‌మెంట్, నెట్ వర్కింగ్ అవకాశాలు పెంచేందుకు సరైన వేదిక ఇది.
అద్భుతమైన సౌకర్యాలతో పాటు 3 వేలమంది కూర్చునే సామర్ధ్యం కలిగిన ఎంఫీ థియేటర్ ఈ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకత. అంటే 3 వేల పీవీఆర్ థియేటర్లకు సమానం.
ఆస్ట్రేలియాలోని సుప్రసిద్ధ సిడ్నీ ఒపేరా హౌస్ సామర్ధ్యం 5500 కాగా ఈ కన్వెన్షన్ సెంటర్ లెవెల్ 3 సామర్ధ్యమే 7000 గా ఉంది.
జీ20 కీలక భేటీ ఇక్కడే జరగనుంది. ఇండియాకు చెందిన ఈ భవనం జర్మనీకు చెందిన హనోవర్ కేంద్రం, షాంఘాయీలోని జాతీయ ప్రదర్శనా కేంద్రాలకు పోటీగా ఉంటుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 123 ఎకరాల్లో ఉన్న ఈ భవనం దేశంలోని ప్రముర్మాణాల్లో అతి పెద్దది. ఐఈసీసీ కాంప్లెక్స్ అనేది ప్రపంచంలోని టాప్ 10 కన్వెన్షన్ కాంప్లెక్స్‌లలో ఒకటి.