Postal jobs 2024: పోస్టల్‌శాఖ గోల్డెన్ ఛాన్స్.. 10వ తరగతి అర్హతతో పరీక్ష లేకుండానే 44,228 ఉద్యోగలకు భారీ నోటిఫికేషన్..
ఇండియా పోస్ట్ 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS) బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)/ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్, వేకెన్సీ బ్రేక్‌అప్, శాలరీ, సెలక్షన్ విధానం ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్ అయిన indiapotgdsonline.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ జూలై 15 నుంచి ప్రారంభించారు. ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 15. అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం ఆగస్టు 6 నుంచి 8 వరకు కల్పిస్తారు. ఇందులో పూర్తిగా 44,228 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఇందులో ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ వివిధ రాష్ట్రాల వ్యాప్తంగా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది
అయితే, ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం 10 వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీ పోస్టల్ శాఖ చేపట్టనుంది. ఇది నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. కేవలం పదవ తరగతి చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీ కోసం. ఈ పోస్టులకు వయోపరిమితి 18- 40 ఏళ్లు. అభ్యర్థుల పదవ తరగతిలో పొందిన మార్కుల జాబితా ద్వారా ఎంపిక జరుగుతుంది.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ శాలరీ రూ. 10,000- రూ. 24,470, BPM- రూ. 12,000-రూ. 29,380 పొందనున్నారు. అప్లికేషన్ విధానం కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు 656 పోస్టులు, తెలంగాణకు 454 పోస్టులు విడుదల చేశారు.
అర్హత.. పదవతరగతిలో మ్యాథ్స్ ఇంగ్లిష్, ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి ఉండాలి. అంతేకాదు అభ్యర్థులు స్థానిక భాషలో కనీసం 10 వ తరగతి వరకు గుర్తింపు పొందిన బోర్డులో చదివి ఉండాలి. అంతేకాదు కంప్యూటర్ నాలెడ్జీ, సైకిల్ తొక్కడం కూడా తెలిసి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం.. పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్ అయిన www.indiapostgdsonline.gov.in ఓపెన్ చేయాలి. మీ వివరాలను అందులో నమోదు చేయాలి. దీనికి మీ వద్ద యాక్టీవ్ ఇమెయిల్ ఐడీ కూడా కలిగి ఉండాలి. దీంతోపాటు మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ కూడా కలిగి ఉండాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఈ రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు దారులు తమ ఫోటో, సంతకం కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీరు ఏ డివిజన్‌కు అప్లై చేస్తున్నారో కూడా తెలియజేయాలి. అప్లికేషన్ రుసుము రూ.100