Honeymoon Destinations: ఇండియా టాప్ 6 హానీమూన్ ప్రాంతాలు, ఎంత ఖర్చవుతుంది
చివరిది ఉదయ్‌పూర్. ఆగస్టు నుంచి మార్చ్ మధ్యలో ఎప్పుడైనా వెళ్లవచ్చు. ఉదయ్‌పూర్ వెళ్లాలంటే ఇద్దరికి 25 వేల నుంచి 30 వేలవరకూ అవుతుంది. ఉదయ్‌పూర్ వెళ్లాలంటే ఫ్లైట్ ద్వారా మహారాణా ప్రతాప్ ఎయిర్‌పోర్ట్ వెళ్లాలి. లగ్జరీ ట్రైన్, ప్యాలెస్ ఆన్ వీల్స్ అనుభూతి కూడా పొందవచ్చు. సిటీ ప్యాలేస్, లేక్ పిచౌలా, ఫతేహ్ సాగర్ లేక్, మాన్‌సూన్ ప్యాలెస్, గులాబ్ బాగ్‌లు ప్రముఖమైన ప్రాంతాలు.
అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్. ఆగస్టు నుంచి మార్చ మధ్యలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. ఇద్దరికి 40 వేల నుంచి 80 వేలవరకూ ఖర్చవుతుంది. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా చెన్నై వెళ్లాల్సి ఉంటుంది. ఆ తరవాత పోర్ట్ బ్లెయిర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకూ వెళ్లవచ్చు. అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్‌లోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు రాస్ ఐల్యాండ్, వైపర్ ఐల్యాండ్ పోర్ట్ బ్లెయిర్, ఎలిఫెంట్ బీచ్, నార్త్ బే ప్రముఖమైనవి.
ఇక నాలుగవది కులూ మనాలీ. ఇక్కడికి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో వెళ్లవచ్చు. ఇద్దరికి 20 వేల నుంచి 35 వేలవరకూ ఖర్చవుతుంది. కులూమనాలీ వెళ్లాలంటే బస్సు ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా భుంటార్ ఎయిర్‌పోర్ట్ వరకూ ఫ్లైట్ ద్వారా వెళ్లవచ్చు. ఇక్కడున్న ప్రముఖ సందర్శనీయ ప్రాంతాలు రోహ్‌తంగ్ వ్యాలీ, భుంగ్ లేక్, ఇగ్లూ స్టే ప్రధానమైనవి.
మూడవది డార్జిలింగ్. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో ఎప్పుడైనా వెళ్లవచ్చు. ప్రస్తుతం అక్కడ మంచి వాతావరణం, అద్భుతమైన దృశ్యాలుంటాయి. ఇద్దరికి 30 వేల నుంచి 50 వేల రూపాయలవరకూ ఖర్చవుతుంది. డార్జిలింగ్ వెళ్లాలంటే బాగ్దోగ్రా ఎయిర్‌పోర్ట్ వరకూ ఫ్లైట్‌లో వెళ్లవచ్చు. డార్జిలింగ్ వెళితే టాయ్ ట్రైన్ ఎక్కడం మర్చిపోవద్దు. ఇది కాకుండా టైగర్ హిల్, జూలాజికల్ పార్క్ వంటివి ఇంకా చాలా ఉన్నాయి.
రెండవ ప్రముఖ పర్యాట కేంద్రం మున్నార్. ఇక్కడికి సెప్టెంబర్ లేదా ఫిబ్రవరి మధ్య రావచ్చు. ఇద్దరికి అయ్యే ఖర్చు 35 వేల నుంచి 50 వేల వరకూ ఉంటుంది. మున్నార్ వెళ్లాలంటే..అలువా రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కాల్సి ఉంటుంది. ఇది ముఖ్యమైన పట్టణాల్నించి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. మున్నార్‌లో ప్రముఖ సందర్శనీయ పర్యాటక ప్రాంతాలు నేషనల్ పార్క్, అనాముదీ మౌంటెయిన్, బ్యాక్ వాటర్స్, అట్టకల్ వాటర్ ఫాల్స్ ముఖ్యమైనవి
మొదటిది ఊటీ. ఆక్టోబర్ నుంచి జనవరి మధ్య వెళ్లవచ్చు. ఇద్దరికి 25 వేల నుంచి 40 వేల వరకూ ఖర్చు కావచ్చు. ఊటీ వెళ్లేందుకు కోయంబత్తూర్ వరకు ఫ్లైట్‌లో వెళ్లవచ్చు. అదే ట్రైన్ ద్వారా వెళ్లాలనుకుంటే మాత్రం మెట్టుపాళ్యం స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. ఊటీ సరస్సు, దొడ్డబెట్ట, రోజ్‌గార్డెన్, ఏవలాంచ్ లేక్ వంటివి ప్రముఖ సందర్శనీయ ప్రాంతాలు.