iPhone 12 Pro Max @ Half Price: సగం ధరకే ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్.. ఒక లుక్కేస్తే పోలా..

Sat, 15 Apr 2023-11:52 am,

యాపిల్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ లాంటి లేటెస్ట్ కాస్ట్ లీ ఐఫోన్ కొనాలనే కోరిక చాలామందిలో ఉంటుంది. కానీ ఈ ఐ ఫోన్ ఖరీదు చాలా ఎక్కువ కావడంతో ఇది అందరికి సాధ్యపడకపోవచ్చు. 

ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ 128GB వేరియంట్ అసలు ధర రూ. 129,900 గా ఉంది. అయినప్పటికీ ఈ ఐ ఫోన్‌కి మార్కెట్లో కస్టమర్స్ నుంచి మస్తు డిమాండ్ ఉంది. అది ఈ ఫోన్ పట్ల ఉన్న క్రేజ్‌కి నిదర్శనం. 

అయితే, అంత పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించలేని వాళ్లు తమ ఇష్టాన్ని చంపుకుని మార్కెట్లో ఉన్న మరేదో ఇతర స్మార్ట్ ఫోన్‌తో సర్ధుకుపోవాల్సిన అవసరం లేకుండా రిఫర్భిష్‌డ్ ఫోన్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

ఇదిలావుంటే, ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా కొద్దికాలం పాటు ఉపయోగించే ఐఫోన్ కోసం అంత పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన అవసరం లేదనుకునే వారు కూడా రిఫర్భిష్‌డ్ ఫోన్స్ కొనుగోలు చేస్తున్నారు.

హై కాస్ట్ కారణంగా తమకు ఇష్టమైన ఫోన్ కొనలేకపోతున్న వారితో పాటు.. ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ అంత పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన అవసరం లేదు అని అనుకునే వారు ఎంచుకుంటున్న మార్గమే రిఫర్భిష్‌డ్ ఫోన్స్.

రిఫర్భిష్‌డ్ ఫోన్స్ కొనుగోలు చేస్తూ ఐ ఫోన్ లాంటి ఖరీదైన ఫోన్స్ కొనుగోలు చేయాలన్న తమ కోరిక తీర్చుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది.

అలా రిఫర్బిష్‌డ్ ప్రోడక్ట్స్ విక్రయించే ఆన్‌లైన్ రిటైల్ స్టోర్ మొబెక్స్ వెబ్‌సైట్లో రిఫర్బిష్‌డ్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ కారుచౌకగా లభిస్తోంది.

ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ 128GB వేరియంట్ అసలు ధర రూ. 129,900  కాగా.. మొబెక్స్‌లో ఈ ఐ ఫోన్ సగం ధరకే లభిస్తోంది. అంటే రూ. 65,999 కే లభిస్తోందన్నమాట.

రూ. 129,900 ఐఫోన్ సగం ధరకే లభించడమే కాదు.. ఈ ఫోన్ కొనే వారికి మరో బంపర్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ వద్ద ఉన్న ఏ క్రెడిట్ కార్డ్ ని అయినా ఉపయోగించి 6 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ పద్దతిలోనూ ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రిఫర్బిష్‌డ్ ఫోన్ అంటే తెలియని వారికి.. అసలు రిఫర్బిష్‌డ్ అంటే ఏంటనే సందేహం వస్తుండొచ్చు. రిఫర్బిష్‌డ్ అంటే ఏంటంటే.. తొలుత ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారు ఏదైనా కారణాల రీత్యా దానిని తిరిగి అమ్మినట్టయితే.. అలా అమ్మిన ఫోన్‌ని కొనుగోలు చేసిన వారు దానిని అన్నివిధాల చెక్ చేసి.. ఎలాంటి లోపం లేకుండా మరమ్మతు చేసి పూర్తిగా కొత్త వస్తువు తరహాలో తిరిగి విక్రయించే ఉత్పత్తులనే రిఫర్బిష్ డ్ అంటుంటారు. అలా రిఫర్బిష్‌డ్ ఫోన్స్‌కి కూడా భారీగానే డిమాండ్ ఉంది.

విక్రయించే వారు కొనుగోలుదారులకు ఏడాది పాటు గ్యారెంటీ లేదా వారెంటీ లాంటి అవకాశం కూడా అందిస్తుంటారు. అందుకే బయర్స్ కూడా ఎలాంటి భయం లేకుండా ఇలాంటి రిఫర్బిష్‌డ్ ఫోన్స్ కొనుగోలు చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link