IPL 2021 Funny Memes: జానీ బెయిర్‌స్టో హిట్ వికెట్‌పై పేలుతున్న జోక్స్, Viral అవుతున్న ఫన్నీ మీమ్స్

Sun, 18 Apr 2021-5:02 pm,

చెన్నై వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మూడో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది. అయితే పవర్‌ప్లే సమయం వరకు ముంబై బౌలర్లను సన్‌రైజర్స్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ఓ ఆటాడుకున్నాడు. (Photos Credit: Twitter)

Also Read: ICC T20 World Cup: ఢిల్లీ వేదికగా పాకిస్తాన్ మ్యాచ్‌లు ఖరారు, ఫైనల్ వేదికపై స్పష్టత వచ్చింది

మూడు బౌండరీలు, నాలుగు సిక్సర్లూ బాదిన జానీ బెయిర్‌స్టో 43 పరుగుల వ్యక్తిగత సోరు వద్ద అనుహ్యంగా వికెట్ సమర్పించుకున్నాడు. జానీ బెయిర్‌స్టోను ఆపతరం కాలేదని ముంబయి ఇండియన్స్‌ జట్టు ఆందోళన చెందుతుంటే ఏకంగా అతడే సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు.  (Photos Credit: Twitter)

సన్‌రైజర్స్ విజయం నల్లేరు మీద నడకే అనుకున్న దశలో భారీ షాట్ ఆడేందుకు యత్నిస్తూ క్రీజు లోపలికి వచ్చిన బెయిర్‌స్టో హిట్ వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. అసలే రెండు మ్యాచ్‌లు ఓడిన సన్‌రైజర్స్ తొలి విజయంపై ధీమాగా కనిపించగా, బెయిర్ స్టో వికెట్‌తో పరిస్థితి మారిపోయింది. దీంతో మ్యాచ్ ఓడిన అనంతరం బెయిర్‌స్టో హిట్ వికెట్‌పై ట్రోలింగ్ మొదలైంది. (Photos Credit: Twitter)

Also Read: IPL 2021: సీఎస్కే జట్టు ఆ తప్పిదం రిపీట్ చేస్తే MS Dhoniపై వేటు తప్పదు, కారణమిదే

గత రెండు మ్యాచ్‌లలో పరవాలేదనిపించిన మనీశ్ పాండే ఈ మ్యాచ్‌లో త్వరగా వికెట్ సమర్పించుకున్నాడు. మరోవైపు పరుగులు చేసేందుకు కష్టపడ్డ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రనౌట్ కావడం మ్యాచ్‌ను మరింత మలుపు తిప్పింది. (Photos Credit: Twitter)

జానీ బెయిర్‌స్టో వికెట్ సమర్పించుకోవడంపై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌తో పాటు సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సైతం ఫన్నీ మీమ్స్, జోక్స్ పేల్చుతున్నారు. అవి ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. (Photos Credit: Twitter)

Also Read: Virat Kohli: అప్పటి నుంచి తన జీవితం మారిపోయిందంటున్న RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ

సన్‌రైజర్స్ మిడిలార్డర్ విఫలం కావడంతోనే సన్‌రైజర్స్ హ్యాట్రిక్ ఓటములకు కారణమైంది. మరోవైపు కేన్ విలియమ్సన్ లాంటి కీలక ఆటగాడికి జట్టులో చోటు కల్పించకపోవడం సన్‌రైజర్స్‌కు ప్రతికూలాంశంగా మారిందని తెలుస్తోంది. (Photos Credit: Twitter)

Note: ఈ ఫన్నీ మీమ్స్ కేవలం సరదా కోసమ మాత్రమే, ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు. ఐపీఎల్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో షేర్ చేసిన కొన్ని మీమ్స్ ఇక్కడ అందిస్తున్నాం. (Photos Credit: Twitter)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link