ICC T20 World Cup: ఢిల్లీ వేదికగా పాకిస్తాన్ మ్యాచ్‌లు ఖరారు, ఫైనల్ వేదికపై స్పష్టత వచ్చింది

ICC T20 World Cup: దాయాది జట్టు పాకిస్తాన్ ఆడనున్న రెండు మ్యాచ్‌లకు ఢిల్లీ వేదికగా మారనుంది. అక్టోబర్ - నవంబర్ నెలలో భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నారిని తెలిసిందే. దాయాది జట్టుకు, సిబ్బంది, మీడియాకు వీసాల సమస్యల లేకుండా చేయడానికి సిద్ధమైంది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 18, 2021, 12:55 PM IST
ICC T20 World Cup: ఢిల్లీ వేదికగా పాకిస్తాన్ మ్యాచ్‌లు ఖరారు, ఫైనల్ వేదికపై స్పష్టత వచ్చింది

ICC T20 World Cup: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 గురించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. దాయాది జట్టు పాకిస్తాన్ ఆడనున్న రెండు మ్యాచ్‌లకు ఢిల్లీ వేదికగా మారనుంది. అక్టోబర్ - నవంబర్ నెలలో భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నారిని తెలిసిందే. ప్రస్తుతానికి అందిన సమాచారం మేరకు పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లకు ఢిల్లీ వేదికగా మారనుంది.

పాకిస్తాన్ క్రికెటర్లు, మీడియా, సంబంధిత వ్యక్తులకు వీసా సమస్యలు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కి సమాచారం అందినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ అనేది అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా నిర్వహించాల్సిన మ్యాచ్‌లు కనుక పాక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని దాయాది జట్టుకు, సిబ్బంది, మీడియాకు వీసాల సమస్యల లేకుండా చేయడానికి సిద్ధమైంది. 

Also Read: IPL 2021, MI vs SRH: ముంబై ఇండియన్స్ గెలుపు.. హైదరాబాద్‌కి వరుసగా మూడో ఓటమి

మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ కుయుక్తులు ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ క్రికెటర్లు, సిబ్బందితో పాటు తమ దేశ క్రికెట్ అభిమానులకు సైతం భారత్ వీసాలు అందించాలని డిమాండ్ చేస్తోంది. 1.1 లక్షల సీట్ల సామర్థ్యం గల అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అవుతుంది. ముంబై, కోల్‌కతాలలో సెమీఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ధర్మశాల వేదికను నాకౌట్ మ్యాచ్‌ల కోసం పరిశీలించారు. 

ఢిల్లీలో పాక్ 2 మ్యాచ్‌లు ఆడనుంది, కానీ నాకౌట్ మ్యాచ్‌లు ఢిల్లీ వేదికగా నిర్వహించడం సరికాదని బీసీసీఐ, ఐసీసీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం 16 జట్లకు టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు అవకాశం దొరకనుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ముంబై, కోల్‌కతా అహ్మదాబాద్, ఢిల్లీ, ధర్మశాల, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వేదికలలో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు పరిశీలిస్తున్నారు.

Also Read: JEE Main 2021: ఎన్‌టీఏ కీలక నిర్ణయం, జేఈఈ మెయిన్ 2021 ఏప్రిల్ సెషన్ పరీక్షలు వాయిదా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News