Virat Kohli: అప్పటి నుంచి తన జీవితం మారిపోయిందంటున్న RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ

IPL 2021 RCB Captain Virat Kohli | కరోనా వైరస్ కారణంగా గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇబ్బంది పడ్డారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు తల్లితండ్రులు కానున్నారని శుభవార్తతో తమకు ఎంతో మేలు జరిగిందంటున్నాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 14, 2021, 04:15 PM IST
Virat Kohli: అప్పటి నుంచి తన జీవితం మారిపోయిందంటున్న RCB కెప్టెన్ విరాట్ కోహ్లీ

IPL 2021 RCB Captain Virat Kohli: టీమిండియాకు అపూర్వ అందించిన కెప్టెన్లలో పరుగుల యంత్రం, ఛేజింగ్ స్టార్ విరాట్ కోహ్లీ ఒకడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇబ్బంది పడ్డారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు తల్లితండ్రులు కానున్నారని శుభవార్తతో తమకు ఎంతో మేలు జరిగిందంటున్నాడు. ఈ ఏడాది జనవరి 11న పండంటి పాప వమికకు అనుష్క జన్మనిచ్చింది. 

తాను తండ్రి అయిన తనలో చాలా మార్పు వచ్చిందన్నాడు. విరాట్ కోహ్లీ ఏం చెప్పాడంటే ‘నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. నా జీవితంలో మరో ప్రాణాన్ని బాధ్యతగా చూసుకోవడం ప్రారంభించాను. తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం ఓ తీరుగా ఉంటుంది. అయితే అనుష్క, నేను పాప బాధ్యతలను ఆనందంగా షేర్ చేసుకుంటాన్నామని’ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్‌లో వీడియో పోస్ట్ చేసింది. 

Also Read: Ben Stokes Injury: రాజస్తాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ, ఐపీఎల్‌కు బెన్ స్టోక్స్ దూరం

నా పాప నవ్వు చూసేందుకు ఎంతగా ఎదురుచూస్తానో మాటల్లో చెప్పలేను. నా ఆలోచనా విధానంలో సైతం చాలా మార్పు వచ్చింది. భగవంతుడు మా ఇద్దరిపై దయచూపి ప్రేమకు ప్రతిరూపాన్ని పాప రూపంలో అందించాడు. ఈ ఏడాది మాకు చాలా అద్భుతంగా గడుస్తోందని విరాట్ కోహ్లీ తన మనసులో మాటల్ని వెల్లడించాడు. 

ఇటీవల జరిగిన తమ ఐపీఎల్ 2021(IPL 2021) తొలి మ్యాచ్‌లో పటిష్టమైన ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. నేడు తమ రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీ ఢీకొట్టనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బుధవారం రాత్రి 7:30 గంటలకు సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ప్రారంభం కానుంది. డిస్నీ + హాట్‌స్టార్‌లో, స్టార్ స్పోర్ట్స్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News