IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో భారీ ధర పలకనున్న 5 మంది ఆటగాళ్లు ఎవరు
ఇషాన్ కిషన్
ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈసారి వేలంలో ఉంటాడు. ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఇతడిని 15.25 కోట్లు చెల్లించి తీసుకుంది. ఈసారి రిటైన్ చేసుకోలేదు.
శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో కేకేఆర్ జట్టు ఐపీఎల్ 2024 టైటిల్ గెల్చుకుంది. అయినా జట్టు అతడిని రిటైన్ చేసుకోలేదు. దాంతో వేలంలో నిలవనున్నాడు. రెండు ఐపీఎల్ జట్లకు ఫైనల్‌లో కెప్టెన్సీ వహించిన ఏకైక ఆటగాడు. అంతకుముందు ఢిల్లీ కేపిటల్స్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
కేఎల్ రాహుల్
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఈసారి వేలంలో నిలుస్తున్నాడు. 32 ఏళ్ల కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 132 మ్యాచ్‌లు ఆడి 4683 పరుగులు సాధించాడు.
అర్షదీప్ సింగ్
అర్షదీప్ సింగ్ అద్భుతమైన టీ20 బౌలర్. డెత్ ఓవర్లలో అద్బుతంగా రాణించగలడు. టీ20 ప్రపంచకప్ 2024లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఇప్పుడు వేలంలో అందరి దృష్టీ ఇతడిపైనే ఉంది
రిషభ్ పంత్
రిషభ్ పంత్ 2016 నుంచి ఢిల్లీ కేపిటల్స్ జట్టుతో ఉన్నాడు. ఈసారి ఢిల్లీ కేపిటల్స్ జట్టు రిటైన్ చేసుకోకపోవడంతో వేలంలో నిలిచాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారీ ధర దక్కించుకోవచ్చని తెలుస్తోంది. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ కూడా సమర్ధుడు.