Ebrahim Raisi Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ప్రమాద దృశ్యాలు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. అధ్యక్షుని మరణంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ దేశంలో 5 రోజులు సంతాపదినాలు ప్రకటించారు
నిన్న అంటే ఆదివారం మే 19వ తేదీ మద్యాహ్నం 12.30 గంటలకు అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హాస్ అలీయేవ్‌తో కలిసి అరాస్ నదిపైనిర్మించిన డ్యామ్ ప్రారంభోత్సవంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాల్గొన్నారు.
ఆదివారం మద్యాహ్నం 2.15 గంటలకు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ద్వారా డ్యామ్ ఏరియల్ సర్వే చేశారు. దాదాపు 3.25 గంటలకు ఇరాన్‌కు అదే హెలీకాప్టర్ ద్వారా పయనమయ్యారు. కాన్వాయ్‌లో మరో రెండు హెలీకాప్టర్లు ఉన్నాయి.
సాయంత్రం 5.45 గంటలకు ఇరాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. హెలీకాప్టర్ ఏమైందో తెలియలేదు. మిగిలిన రెండు హెలీకాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ కూలినట్టుగా సమాచారం అందింది. దాంతో రెస్క్యూ ఆపేరషన్ ప్రారంభమైంది.
ప్రతికూల వాతావరణం, భారీ వర్షం కారణంగా హెలీకాప్టర్ లొకేషన్ గుర్తించడం కష్టమైంది. రాత్రంగా సెర్చ్ తరువాత టర్కీ ద్రోన్లు దూరం నుంచి క్రాష్ ప్రాంతాన్ని గుర్తించగలిగాయి. అజర్ బైజాన్ సరిహద్దులోని ఇరాన్‌కు చెందిన వర్జేధన్ పట్టణం వద్ద క్రాష్ అయినట్టు తేలింది.
సెర్చ్ ఆపరేషన్ రాత్రంతా కొనసాగింది. ఇవాళ ఉదయం అజర్ బైజాన్ కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో హెలీకాప్టర్ శకలాలు కన్పించాయి.
దూరం నుంచి పొగ రావడం గమనించిన టర్కీ ద్రోన్లు అక్కడికి చేరుకోగానే హెలీకాప్టర్ శకలాలు కన్పించాయి. ఆ తరువాతే ఇరాన్ అధ్యక్షుడి మరణవార్తను అధికారికంగా ప్రకటించారు.