Train Ticket: పండక్కి ఊరేళుతున్నారా..? సింపుల్‌గా రైల్వే టికెట్ ఇలా బుక్ చేసుకోండి..!
పండుగ సీజన్ వచ్చిందంటే చాలు రైళ్లలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నగరాలు, పట్టణాల్లో పనిచేస్తున్న వారు కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళ్లిపోతారు. వీరిలో ఎక్కువ మంది రైలు ప్రయాణాలకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైళ్లలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రైల్వే టికెట్ కౌంటర్ వద్ద కూడా భారీ క్యూలైన్లు ఉంటాయి.
మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌లను ముందుగా బుక్ చేసుకోండి. ఆన్‌లైన్ రైల్వే టిక్కెట్‌లను ఐఆర్‌సీటీసీ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అనంతరం మీరు ఎక్కే స్టేషన్.. వెళ్లాలనుకునే స్టేషన్ ఎంటర్ చేసి చేయండి.
ఆ తేదీన అందుబాటులో ఉన్న రైళ్లు, టైమ్ అన్ని కనిపిస్తాయి. మీరు వెళ్లాలనుకునే రైలును ఎంచుకోండి. మీ పేరు, వయసు ఇతర వివరాలు అందజేసి.. పేమెంట్ చేయండి. ఆ తరువాత మీ టికెట్ బుక్ అవుతుంది.