AR Rahman: ధనుష్ నుంచి ఏఆర్ రెహమాన్ వరకు.. 80% విడాకులకు కారణం ఇర్కొన్సిలబల్ డిఫరెన్సెస్.. అర్థమేమిటంటే..?
భారతదేశంలో ఉన్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఏఆర్ రెహమాన్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఆస్కార్ విజేత అయిన ఏఆర్ రెహమాన్ తన వ్యక్తిగత జీవితం గురించిన విషయాలు చాలా సీక్రెట్ గా ఉంచుతారు. 1995లో సైరాబాను అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఏఆర్ రెహమాన్ తాజాగా తమ 29 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు.
29 ఏళ్ల పాటు కలిసి ఉన్న భార్యకి ఏఆర్ రెహమాన్ విడాకులు ఇచ్చారు. ఈ వార్త సోషల్ మీడియాలో అభిమానులకి భారీ షాక్ ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఈ జంట విడిపోవడానికి కారణం ఏంటి అని సోషల్ మీడియాలో బోలెడు కథనాలు బయటకు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఏఆర్ రెహమాన్, సైరా బాను విడాకులు తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఎమోషనల్ ఒత్తిడి అని తెలుస్తోంది.
వారిద్దరి మధ్య సరిదిద్దుకోలేని భేదాలు ఏర్పడడంతో.. ఈ జంట కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారతదేశంలో చాలా శాతం విడాకులకు కారణం ఇదే. విడాకుల గురించి ప్రకటించిన తర్వాత సైరా బాను లాయర్ వారికి మధ్య ఉన్న టెన్షన్లు, ఇబ్బందుల కారణంగా వాళ్ళు కలిసి ఉండలేకపోయారు అని.. అందుకే విడాకులు తీసుకున్నారు అని ప్రకటించారు.
లీగల్ గా దీనిని irreconcilable differences (సరిదిద్దుకోలేని భేదాలు) అని అంటారు. తమ మధ్య ఉన్న విభేదాలను సరిదిద్దుకోలేని చాలా మంది జంటలు ఇక కలిసి ఉండలేక విడిపోతారు. వైవాహిక జీవితంలో ఉంటూ బాధపడటం కంటే.. విడిపోయి సంతోషంగా ఉండటం మేలు అని చాలామంది విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వస్తూ ఉంటారు.
విడాకులలో కూడా రెండు రకాల విడాకులు ఉంటాయి. ఒకటి కంటెస్టెడ్ డివోర్స్. అంటే అందులో ఒకరు మాత్రమే విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతారు కానీ మరొకరు దానికి ఒప్పుకోరు. ఈవిడకులు మంజూరు కావడానికి నాలుగు నుంచి ఐదు ఏళ్ళు పడుతుంది. మరొక రకం మ్యూచువల్ డివర్స్. ఇందులో ఇద్దరు విడాకులు తీసుకోవడానికి సిద్ధం అవుతారు. ఈ నేపథ్యంలో ఒకటిన్నర నుంచి రెండేళ్లలోపు విడాకులు మంజూరు అవుతాయి.
కొన్ని సంవత్సరాలపాటు ఒక మనిషితో కలిసి ఉన్నాక.. వారి నుంచి విడిపోవడం అనేది ఎవరికైనా చాలా కష్టమైన నిర్ణయమే అవుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి బతకలేము అని నిర్ణయించుకున్న చాలా జంటలు ఇప్పుడు విడాకుల బాటలోనే వెళుతున్నాయి. ఏ ఆర్ రెహమాన్, సైరా బానుల జంట కూడా ఈ కోవకే చెందుతుంది.