Isha Ambani House: ఇషా అంబానీ కుమార్తె ఇషా అంబానీ బంగ్లా ధర ఎంతో తెలుసా.. ఆ ఇంటి పిక్స్ చూస్తే మెంటలే..!
లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్ మధ్యలో ఇషా అంబానీ భారీ బంగ్లా ఉంది. 38 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించారు.
ఇందులో 12 బెడ్‌రూమ్‌లు, 24 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. ఇండోర్ పికిల్‌బాల్ కోర్ట్, జిమ్, సెలూన్, స్పా, ఇన్ఫినిటీ పూల్, అవుట్-డోర్ కిచెన్ అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఇంటి బయట తోట కూడా ఉంది.
ఈ లగ్జరీ బంగ్లాను హాలీవుడ్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, ఆమె భర్త బెన్ అఫ్లెక్ కొనుగోలు చేశారు. రూ.500 కోట్ల డీల్ జరిగినట్లు సమాచారం.
జెన్నిఫర్ లోపెజ్ 2022లో బెన్ అఫ్లెక్‌ని పెళ్లి చేసుకుంది. జెన్నిఫర్ ఆస్తుల విలువ దాదాపు రూ.3332 కోట్లు ఉంటుంది.
డ్యాన్సర్‌గా కెరీర్ ఆరంభించిన జెన్నిఫర్.. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.
ఆనంద్ పిరమల్‌తో ఇషా అంబానీ పెళ్లి 2018లో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇషా అంబానీకి ఆమె మామ గారు ముంబైలోని సీ వ్యూ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చారు.
త్రీడీ డైమండ్ థీమ్ డిజైన్‌లో నిర్మించిన ఈ భవనాన్ని గులిటా అని పిలుస్తారు. 50 వేల చదరపు అడుగుల నిర్మించగా.. రూ.500 కోట్ల వరకు విలువ ఉంటుంది.
రిలయన్స్ రిటైల్ బిజినెస్ బాధ్యతలను ఇషా అంబానీ చూసుకుంటున్నారు. ఆమె నాయకత్వంలోనే ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ దూసుకుపోతుంది.