itel P55T Price Drop: గోల్డెన్ చాన్స్.. 6000Mah బ్యాటరీ itel P55T మొబైల్‌పై ఏకంగా రూ.6,900 డిస్కౌంట్..
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లోని ప్రత్యేకమైన డీల్ లో భాగంగా itel P55T స్మార్ట్ ఫోన్ అత్యంత తగ్గింపు ధరతో లభిస్తుంది. దీనిపై అదనంగా ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ itel P55T స్మార్ట్ ఫోన్ అత్యంత శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇది ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు రెండు రోజులపాటు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.
ప్రస్తుతం ఈ మొబైల్ మార్కెట్లో కేవలం 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంటులో మాత్రమే అందుబాటులో ఉంది. దీని బ్యాక్ సెటప్ లో 50 ఎంపీ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది.
ప్రస్తుతం ఐటెల్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.11,999లకు విక్రయిస్తోంది. అయితే దీనిని ఇప్పుడే అమెజాన్ లో కొనుగోలు చేస్తే 39 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను కేవలం రూ.7,299కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్ పై అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ చూస్తే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్ బ్యాంక్, ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది.
అలాగే అదనంగా భారీ డిస్కౌంట్ పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్ ను వినియోగిస్తే ఏకంగా రూ.6,900 డిస్కౌంట్ పొందుతారు.