Jabardast Chalaki Chanti: నా పొట్ట కొట్టినవాడి నాశనం చూశాకే చచ్చిపోతా.. జబర్దస్త్ చలాకీ చంటి షాకింగ్ కామెంట్స్
Jabardast Chalaki Chanti Shocking Comments: చలాకి చంటి అంటేనే పేరులోనే చలాకీతనం కనిపిస్తుంది. జబర్దస్త్ ద్వారా ఒక వెలుగు వెలిగిన చలాకి చంటి..గత కొద్ది కాలంగా బుల్లితెరకు, అటు వెండితెరకు దూరమయ్యాడు. అసలు చలాకీ చంటికి ఏమైంది..? ఎప్పుడూ తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే చలాకీ చంటి ఏమైపోయాడు అని ఫ్యాన్స్ చాలా కాలంగా వెతుకుతున్నారు.
అయితే అందుకు సమాధానం గా ఇటీవల ఆయన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ప్రత్యక్షమయ్యాడు. అందులో కొన్ని సంచలన నిజాలను చెపుతూ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాడు. గుండెకు సంబంధించిన అనారోగ్యంతో చలాకి చంటి ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత కోలుకొని చంటి ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు అందరితోనూ పరిచయం ఉందని కానీ తను ఆసుపత్రిలో పడి ఉన్నప్పుడు ఎవరు పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బు ఉంటేనే ఈ లోకం పలకరిస్తుందని, చివరకు మనం పెంచుకున్న కుక్క అయినా సరే దానికి రోజు చికెన్ మటన్ తినిపిస్తేనే వచ్చి తోక ఊపుతుందని ఏమీ లేకపోతే దగ్గరకు కూడా రాదని వేదాంతం వ్యక్తం చేశాడు.
అయితే అందుకు సమాధానం గా ఇటీవల ఆయన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ప్రత్యక్షమయ్యాడు. అందులో కొన్ని సంచలన నిజాలను చెపుతూ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాడు. గుండెకు సంబంధించిన అనారోగ్యంతో చలాకి చంటి ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత కోలుకొని చంటి ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.
తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన చుట్టూ అంతవరకు ఉన్న వారెవరు అక్కడ కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జబర్దస్త్ లో ఉండి, అటు సినిమాల్లోనూ ఈవెంట్లు స్కిట్లలో బాగా డబ్బు సంపాదిస్తున్నప్పుడు అందరూ తన చుట్టూ ఉండే వారిని, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకడు రాలేదని వాపోయారు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఎంత కష్టమైనా నష్టమైనా బాగా డబ్బు సంపాదిస్తున్నట్లు కనిపించాలని, లేకపోతే ఎవరూ పట్టించుకోరని ఎవరు దేనికి పిలవరన్నారు.
ఈ లోకంలో ఎవరైనా సరే మనం బాగుంటేనే వచ్చి బాగున్నావా అని పలకరిస్తారని, బాగోలేకపోతే మాత్రం దరిదాపుల్లోకి కూడా ఎవరూ రారని పలకరించే నాధుడు కూడా లేరని అన్నారు. ఇది కలియుగమని ఇక్కడ ఎవరిని నమ్మడానికి వీలులేదని ఎవరి పైన ఆశలు పెట్టుకోకూడదని వేదాంతం పలికాడు.
అంతే కాదు తనకు వేషాలు రాకుండా అడ్డుకుంటున్న వారికి శాపనార్థాలు కూడా పెట్టాడు. తనకు ఈగో ఎక్కువ అని షూటింగుకు వస్తే చాలా డబ్బు తీసుకుంటానని కొంతమంది బయట ప్రచారం చేశారని, తనకు సంబంధం లేని గొడవల్లో తన పేరు ఇరికించి అవకాశాలు రాకుండా చేశారని, అలా తన పొట్ట కొట్టిన వారు సర్వనాశనమవుతారని చంటి శాపనార్థాలు పెట్టాడు. వారు సర్వనాశనం అవ్వాలని తాను దేవుడిని కోరుకుంటానని.. అలాంటివారు నాశనం అవడం తాను కళ్ళతో చూస్తానని ఈ సందర్భంగా చంటి ఎమోషనల్ అయ్యారు.