Stomach Pain: ఏం తిన్నా పొట్ట నొప్పిగా ఉంటుందా? ఈ టిప్స్‌తో 10 నిమిషాల్లో మాయం..
వానా కాలంలో చాలా మందిలో పొట్ట సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు గోరు వెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది. ఇలా నీటిని తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బెల్లం నీరు కూడా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ పొట్టలోని మంట గ్యాస్ వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయ పడుతుందది. ముఖ్యంగా మసాలలతో తయారు చేసిన ఆహారాలు తిన్నప్పుడు చాలా మందిలో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా బెల్లం నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
కలబంద జ్యూస్ కూడా పొట్ట నొప్పులను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యలను తగ్గించడమేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యాపిల్ వెనిగర్ వాటర్ కూడా పొట్ట సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది. ప్రతి రోజు దీనిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు దీనిని నీటిలో కలిపి తీసుకోవాలి.
నిమ్మరసం కూడా సాధరణ పొట్ట నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.