Jammu And Kashmir: కుల్గాంలో మరోసారి కాల్పుల మోత.. ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారతసైన్యం..
విశ్వసనీయ సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ముఖ్యంగా సౌత్ కాశ్మీర్ కుల్గాంలోని కద్దర్ విలేజ్ లో కార్డెన్ నిర్వహించినప్పుడు ఉగ్రమూకల ఉనికి కనిపించింది. దీంతో ఒక్కసారిగా వారిని భారత సైన్యం చుట్టుముట్టింది.
దీంతో తప్పించుకునేందుకు ఉగ్రవాదులు భారత సైన్యంపై ఒక్కసారిగా కాల్పులతో విరుచుకు పడ్డాయి. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భారత సైన్యం ఐదుగురు ఉగ్రవాదులను మట్టు పెట్టింది ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఆర్మీలకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ఈ ఉగ్రవాదులు స్థానికంగా ఉండేవారిగా గుర్తించారు. వారి మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఇక జూలై 8వ తేదీన కూడా ఇలాగే కుల్గాంలో భారత సైన్యంపై ఎనిమిది మంది ఉగ్రవాదులు దాడి చేశారు ఇందులో భారత సైన్యం ఇద్దరూ సైనికులను కోల్పోయింది. ఈరోజు గురువారం జరిగిన ఈ అటాక్ ఏడాదిలో రెండోది.
పక్కా సమాచారం మేరకు వెళ్లిన ఆర్మీ వారిని పట్టుకునేందకు ప్రయత్నించారు. అయితే, చనిపోయిన ఐదుగురు ఉగ్రవాదులుగా గుర్తించిన పోలీసులు ఇంకా వారి మృతదేహాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది అని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.