Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఇంటిని చూశారా.. ఇంద్ర భవనాన్ని తలదన్నేలా జనసేనాని ఇళ్లు..

Mon, 05 Aug 2024-2:33 pm,

పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాల్లో పవర్ స్టార్ గా సత్తా చూపెడుతున్నాడు. హీరోగా పీక్స్ లో  ఉండగానే..2014లో జనసేన పార్టీ స్థాపించారు. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు ప్రకటించారు.

ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పొట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసాడు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయారు.

కానీ 2024 ఎన్నికల ముందే వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనవ్వనని చెప్పి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలో కూటమిగా కలిసి పోటీ చేసి పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్ట్రెక్ రేట్ ఉన్న పార్టీగా నిలిచింది.

 

ఆ సంగతి పక్కన పెడితే.. హైదరాబాద్ జూబ్లి హిల్స్ లో  జనసేనాని ఉంటున్న ఇంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అందులో పెద్ద లాన్ కూడిన 6 వేల గజాల్లో పవన్ కళ్యాణ్  ఇల్లు ఉంది. ఈ ఇంటి విలువ ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల వరకు ఉంటుందనేది టాక్. మొత్తంగా గార్డెనింగ్ తో ఉన్న ఈ ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. పవన్ కళ్యాణ్ ఇంట్లో పెద్ద లాన్ తో పాటు ఓ స్మిమ్మింగ్ ఫూల్ తో పాటు పార్టీ మీటింగ్ కోసం హాల్, జిమ్ ఉన్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link