Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్‌లో పరవశంలో తేలిపోతున్న జాన్వీ కపూర్.. దేవర భామ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..

Sun, 17 Mar 2024-11:09 am,

అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఆ తర్వాత తనకంటూ స్పెషల్ ఐడెండిటీ తెచ్చుకునే పనిలో పడింది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉంది.

బాలీవుడ్‌లో 'ధడక్‌' మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' మూవీలో తొలి మహిళా ఫైటర్ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

తల్లి ఒకప్పటి లేడీ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ పెద్ద నిర్మాత.. బాబాయి అనిల్ కపూర్ ఒకప్పటి బీ టౌన్ సూపర్ స్టార్ అయినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది జాన్వీ కపూర్.

ఎన్టీఆర్‌తో చేస్తోన్న 'దేవర' మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూస్తోంది. ఈ సినిమా ఈ యేడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా తెరక్కుతోంది.

అటు ఎన్టీఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్‌, బుచ్చిబాబు సన మూవీకి సైన్ చేసింది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో జాన్వీ కపూర్ జాయిన్ కానుంది.

ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్ ఎపుడు వార్తల్లో వ్యక్తిగా ఉంటుంది జాన్వీ కపూర్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link