Janhvi Kapoor: అచ్చం శ్రీదేవిలా కనిపించిన జాన్వి కపూర్.. చీరలో మెరిసిపోయిన నటి
టాలీవుడ్ అతిలోకసుందరి గా పేరు తెచ్చుకుంది అలనాటి హీరోయిన్ శ్రీదేవి. శ్రీదేవికి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమెను ఇప్పటికీ అభిమానించే వారు ఎంతోమంది ఉన్నారు.
అలాంటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఎప్పుడెప్పుడు తెలుగు సినిమాలలో కనిపిస్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ధడక్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్.
ఆ తరువాత ఎన్నో హిందీ సినిమాలలో నటించిన జాన్వి ఇంకా తెలుగు తెరపై మాత్రం కనిపించలేదు. అయితే మరి కొద్ది రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాలా దర్శకత్వంలో వస్తున్న దేవరా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది.
మొదటి సినిమా దేవరా విడుదల కాకముందే.. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.
ఇక ఎప్పుడెప్పుడు జాన్వి కపూర్ తెలుగు సినిమాలు విడుదలవుతాయా ఆమెని వెండి ధర పైన చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
తెలుపు రంగు పైన ఎరుపు పూలు ఉండే చీరలో కనిపిస్తూ జాన్వి కపూర్ అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ ఫోటోలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే ఇందులో జాన్వి కపూర్ అచ్చం తన తల్లి శ్రీదేవిలా కనిపించడం.