జాన్వి కపూర్ బ్యూటీ సీక్రెట్ అదే.. ఇలా చేస్తే మొహం మెరిసిపోవడం ఖాయం..!
ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో.. రానున్న దేవర సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది జాన్వి కపూర్. ఈ హీరోయిన్ ఇప్పటికే.. పలు హిందీ సినిమాలలో నటించి.. మంచి పేరు తెచ్చుకునింది. శ్రీదేవి, బోనీకపూర్.. మొదటి కుమార్తె అయిన జాన్వి కపూర్..ధడక్ అనే చిత్రంతో.. సినిమా ప్రేక్షకులకు పరిచయమైంది..
శ్రీదేవి కూతురు కావడంతో..తెలుగులో ఇంకా తన మొదటి సినిమా విడుదల కాకముందే.. ఆమెకు సౌత్ లో అభిమానులు ఏర్పడ్డారు. జాన్వీ కపూర్.. చూడడానికి అచ్చం శ్రీదేవిలాగా.. ఉంటుందని ఎంతోమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. అప్పట్లో శ్రీదేవిని.. అతిలోకసుందరి అనేవాళ్ళు అన్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇక జాన్వి కపూర్.. ఈ తరం అతిలోక సుందరి అంటూ ఇంస్టాగ్రామ్ లో తెగ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అభిమానులు. ఈ క్రమంలో జాన్వి కాపూర్ అందానికి.. గల సీక్రెట్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
జాన్వీ కపూర్ చర్మం మేకప్ లేకపోయినా.. జిమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా.. మెరిసిపోతుంది. అయితే దీనికి గల రహస్యాన్ని.. పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. జాన్వి కపూర్ తన తల్లి శ్రీదేవి సూచించిన ఫ్రూట్ మాస్క్ లను.. ఎక్కువగా వాడుతుండట. తాను మొదటి నుంచి ఈ ఫ్రూట్ మాస్కులను.. ముఖానికి వాడతానని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.
ఈ ఫ్రూట్ మాస్క్ కోసం జాన్వి కపూర్.. సీజనల్ ఫ్రూట్ ప్రిఫర్ చేస్తుండట. ఆ ఫ్రూట్ ని మెత్తగా రుబ్బి అందులో పెరుగు, తేనె మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఆ తర్వాత సగం కట్ చేసిన ఆరెంజ్ సాయంతో ముఖాన్ని సున్నితంగా రుద్దాలి. జాహ్నవి చెప్పిన ఈ బ్యూటీ సీక్రెట్ బాగా పనిచేస్తుంది. మన చర్మాన్ని వేగంగా మెరిసేలా చేస్తుంది.