Janhvi Kapoor: తంగం కొత్త ఫోటోలు.. మరింత హీటెక్కిస్టోన్న జాన్వి కపూర్..
జాన్వి కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బోనీకపూర్, శ్రీదేవి మొదటి కుమార్తె జాన్వి కపూర్.. ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది.
ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తంగం క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది ఈ హీరోయిన్.
ఈ చిత్రంలో జాన్వి కనిపించింది కేవలం 10 నిమిషాలు మాత్రమే. కానీ ఉన్నంత పరిధిలోనే తన గ్లామర్ తో తెగ ఆకట్టుకుంది. ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ ప్రేక్షకులను థియేటర్స్ లో ఉర్రూతలూగించింది.
తాజాగా ఈ సినిమాలోని తంగం క్యారెక్టర్ కి సంబంధించిన మరికొన్ని ఫోటోలు.. జాన్వి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాను దేవర కోసం చేసిన పడవ.. పైన పడుకొని ఆ పడవకి పెయింట్ వేస్తూ కనిపించింది తంగం.
ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రం తరువాత జాన్వి.. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న 16వ చిత్రంలో కూడా హీరోయిన్గా కనిపించనుంది.
మరోపక్క దేవర 2 చిత్రంలో తంగం క్యారెక్టర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని.. ఇప్పటికే జాన్వి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే ఆమె అభిమానులు ఈ రెండో భాగంలో ఆమె క్యారెక్టర్ కోసం పెద్ద ఎదురు చూస్తున్నారు.