Taimar Valley: దేశంలో భయం గొలిపే వ్యాలీ, ఇక్కడికి రాగానే తేదీ సమయం మారిపోతుంటాయి

Sat, 22 Jul 2023-11:41 pm,

ఈ ప్రాంతంలో హాజరు వేయాలంటే రిజిస్టర్ అవసరమౌతుంది. కర్కాటక రేఖ ఈ ప్రాంతం నుంచే వెళ్తుందని కొందరు చెబుుతుంటారు. అందుకే ఈ సమస్య ఉంటుందని చెబుతారు. అయితే కొంతమంది మాత్రం ఈ దెయ్యం ఘటనను కొట్టిపారేస్తుంటారు. అదే నిజమైతే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెంది ఉండేది కాదంటారు.

ఈ ప్రమాదాల్నించి తప్పించుకునేందుకు స్థానికులు ఓ ఆలయాన్ని నిర్మించారు. దేవతే స్వయంగా అప్పుడప్పుడూ స్త్రీ వేషంలో రోడ్డుపైకి వస్తుందని పూజారి చెబుతున్నారు. ఇక్కడ బయోమెట్రిక్ హాజరు వేయడం అసాధ్యమని ఓ టీచర్ చెబుతున్నారు. ఎందుకంటే బయోమెట్రిక్ హాజరు వేసేటప్పుడు ఒక్కోసారి తేదీ మారిపోతోందట.

రాంచీకి సమీపంలోని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ 4 లైన్ల రహదారికి ఇరువైపులా పచ్చదనమే ఉంటుంది. ఇక్కడ చాలా రిఫ్రెషింగ్ అనుభూతి ఉంటుంది. చాలామంది పర్యాటకులు ఫోటోల కోసం ఆగుతుంటారు. ఈ ప్రాంతంలో ఓ మహిళ తెల్లచీరలో తిరుగుతూ కన్పిస్తుందని స్థానికులు చెబుతుంటారు. రోడ్డు మద్యలో మహిళను కాపాడే ప్రయత్నంలో ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయిట.

ఎన్‌హెచ్ 33 హైవే రాంచీని జంషెడ్ పూర్‌తో అనుసంధానం చేస్తుంది. దీనినే మరణ రహదారి అంటారు. ఇక్కడికి వస్తూనే వాహనాల వేగంలో మార్పు వచ్చేస్తుంది. ఈ హైవేలో ఎదురయ్యే తైమార్ వ్యాలీ అందర్నీ భయపెడుతుంటుంది. ఎందుకంటే ఈ వ్యాలీ ఎందరికో మరణ శాసనం లిఖించింది.

ప్రపంచంలోని రహస్య ప్రాంతాల గురించి, అక్కడి విశేషాల గురించి తరచూ తెలుసుకుంటుంటాం. అంతకంటే ఎక్కువ రహస్యమైన ప్రాంతమిది. జార్ఘండ్ లోని రాంచీ సమీపంలో ఉన్న ప్రాంతమిది.  స్థానికులు చెప్పిందాని ప్రకారం ఇక్కడికి రాగానే మీ గడియారం వెనక్కి తిరుగుతుందట. సమయం మారిపోతుందట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link