Jio Superhit plan: జియో దీపావళి ధమాకా ఆఫర్స్.. రూ.899 రీఛార్జీ ప్యాక్‌పై రూ.3,350 బెనిఫిట్స్..
జియో దీపావళి ధమాకా ఆఫర్ పొందాలంటే రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకోవాలి. ఇందులో 5జీ, స్పీడ్ 2 జీబీ డేటా ప్రతిరోజూ అందుకుంటారు. లేదా 4జీ స్పీడ్ 20 జీబీ అదనంగా పొందుతారు. ఇది ఏడాది ప్లాన్ అయిన రూ.3,599 లో కూడా అందుబాటులో ఉంది. ఇందులో ప్రతిరోజూ 2.5 జీబీ డేటా 4 జీ,5జీ స్పీడ్ నెట్ అందుబాటులో ఉంటుంది.
ఇందులో అదనంగా ఇతర రీఛార్జీ ప్లాన్ల మాదిరి ఇందులో కూడా జియో యాప్స్ ఉచితంగా పొందుతారు. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు.
ఈ రెండూ రూ.899, రూ.3,599 రీఛార్జీప్లాన్‌పై జియో ఏజియోలో షాపింగ్ చేస్తే రూ.200 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తుంది.
హోటల్ బుకింగ్ కు ఈజ్ మై ట్రిప్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకుంటే రూ.3000 ఆఫర్ పొందుతారు. స్వీగ్గీ ద్వారా రూ.300 అంతకు ఎక్కువ ధరలో ఫుడ్ బుక్ చేసుకుంటే రూ.150 ఆఫర్ లభిస్తుంది.
మైజియో యాప్ ఓచర్స్ సెక్షన్‌లోని 'మై విన్నింగ్స్' లో ఇవి అందుబాటులో ఉంటాయి. కూపన్ కాపీ చేసుకుని షాపింగ్ చేసి ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే, ఈ రీఛార్జీ ప్లాక్‌లను నవంబర్ 5వ తేదీలోపే తీసుకోవాలి.