Devara Review: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్..
‘దేవర’ ఎన్టీఆర్ హీరోగా నటిస్తూన్న 30వ చిత్రం. మరియు నటుడిగా థియేట్రికల్ గా విడుదల అవుతున్న 32వ మూవీ. చిన్నపుడు ‘రామాయణం’ సినిమాలో ఎన్టీఆర్ బాల రాముడిగా నటించాడు. అటు వెంకటేష్ హీరోగా నటించిన ‘చింతకాయల రవి’ మూవీలో అతిథి పాత్రలో మెరిసాడు.
ఎన్టీఆర్ కెరీర్ లో రెండు పార్టులుగా విడుదల కాబోతున్న మొదటి చిత్రం ‘దేవర’. అందులో ఫస్ట్ పార్ట్ మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాతఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రం ‘దేవర పార్ట్ -1’
ఎన్టీఆర్ ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో నటించిన ఐదో చిత్రం ‘దేవర’. గతంలో ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి, జై లవకుశ సినిమాల్లో ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ లో కనిపించారు.
ఆంధ్రావాలా, శక్తి సినిమాల్లో తండ్రీ తనయుల పాత్రల్లో కనిపించిన ఎన్టీఆర్.. ‘దేవర’ లో కూడా మరోసారి తండ్రి కొడుకులుగా ‘దేవర’, వరద’గా తారక్ కనిపించనున్నాడు.
అదుర్స్ లో కవల సోదరులుగా ద్విపాత్రాభినయం చేస్తే... ‘జైలవకుశ’లో ముగ్గురు కవల సోదరులుగా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు.
ఈ సంగతి పక్కన పెడితే.. ఎన్టీఆర్ సినిమాకు తొలిసారి అనిరుథ్ సంగీతం అందించారు. తొలిసారి ఎన్టీఆర్ తో జాన్వీ, శృతి మరాఠే, సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఇందులో ‘చుట్టమల్లే’ సాంగ్ ను సెన్సెషన్ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సొంతంగా చేసుకున్న సాంగ్ గా రికార్డులకు ఎక్కింది.
ఇక విదేశాల్లో ప్రీ సేల్స్ లో ఫాస్ట్ గా మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన సినిమాగా ‘దేవర’ రికార్డులకు ఎక్కింది. ట్రైలర్ రిలీజ్ కాకముందే ఈ రేంజ్ లో ఈ రికార్డు సాధించిన ఫస్ట్ మూవీగా ‘దేవర’ నిలిచింది.
లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ లో ‘దేవర’ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. అక్కడ థియేటర్స్ లో ప్రదర్శితం కాబోతున్న ఫస్ట్ భారతీయ సినిమాగా ‘దేవర’ రికార్డు క్రియేట్ చేసింది.
మరోవైపు విదేశాలైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో ఎక్కువ సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించబోతున్న తొలి భారతీయ మూవీగా ‘దేవర’ పేరిట నమోదు అయింది.