Juices For Gas And Indigestion: గ్యాస్, అజీర్తి సమస్యలను దూరం చేసే జ్యూస్‌లు
పుదీనాలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడగట్టి తాగితే గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
అల్లం జీర్ణక్రియ రసాలను పెంచడంలో సహాయపడుతుంది. అల్లం ముక్కను తురిమిన నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే గ్యాస్, అజీర్తి, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.
దోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దోసకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ లభిస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా సహాయకారిగా ఉంటుంది. బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.