Sneha ullal: జూనియర్ ఐశ్వర్యారాయ్ గుర్తుందా.. ఒక్క నైట్ లోనే స్టార్ స్టేటస్.. కానీ.!

Sat, 10 Aug 2024-10:47 pm,

సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి..ఎంతోమంది హీరోయిన్లు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని అడుగు పెడుతూ ఉంటారు. అయితే అందులో కొంతమంది ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంటే,  మరికొంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే దూరం అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఒకటి రెండు సినిమాలలో నటించింది తన నటన కంటే ఎక్కువగా మిస్ యూనివర్స్ ఐశ్వర్యరాయ్ లాగా ఉంటుందని పేరు కూడా దక్కించుకుంది.. జూనియర్ ఐశ్వర్యరాయ్ అంటూ పిలిపించుకుంది. కానీ అంతలోనే ఇండస్ట్రీ నుంచి దూరం అయిపోయింది.  

జూనియర్ ఐశ్వర్యరాయ్ గా పేరు సొంతం చేసుకున్న.. స్నేహ ఉల్లాల్ ఒకటి రెండు చిత్రాలలో మాత్రమే..నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించలేదని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా చాలా రోజుల తర్వాత..సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మను చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.   

తన అందాలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన ఈమె తొలి సినిమాలోనే తన నటనతో గ్లామర్ తో ఫిదా చేసేసింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.  1985 డిసెంబర్ 8న ఒమన్ లోని మస్కట్ లో జన్మించిన స్నేహ ఉల్లాల్ నో టైం ఫర్ లవ్ అని హిందీ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించి ఇండస్ట్రీకి పరిచయమయింది. అయితే బాలీవుడ్లో అవకాశాలు అందుకోకుండా ఈమె టాలీవుడ్ కి వచ్చేసింది.

తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటించి ఆకట్టుకోవడమే కాదు జూనియర్ ఐశ్వర్యారాయ్ అనే బిరుదును కూడా సొంతం చేసుకుంది.  2017 లో వచ్చిన సింహా సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన ఈమె .. ఆ తరువాత మరో తెలుగు చిత్రంలో కూడా నటించలేదు. ఇక చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు . 

ఈమె ఇంతకాలం ఎక్కడుంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా నటించిన  కింగ్ చిత్రంలో నువ్వు రెడీ నేను రెడీ అనే పాటలో కూడా కనిపించింది. ఆ తర్వాత కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కనిపించిన ఈమె మళ్లీ సినిమాలలో నటించలేదు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link