Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..

Tue, 11 Jun 2024-9:35 pm,

ఆంధ్ర ప్రదేశ్ లో రేపు   (బుధవారం) చరిత్రలో లిఖిందచ దగ్గ పరిణామం చోటు చేసుకుంటుంది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అఖండ విజయం అందిచారు. ఈ నేపథ్యంలో కూటమిని ప్రజలు మనస్పూర్తీగా దీవించారు.

ఈరోజు చంద్రబాబును కూటమి నేతలు తమ శాసనసభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ దగ్గరకు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వనించాలని కోరారు.  చంద్రబాబుకు ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మద్దతు ఉండటంతో గవర్నర్ కూడా ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకు వెల్ కమ్ చెప్పారు.

మరోవైపు ఇప్పటికే కృష్ణా జిల్లాకు కేసరపల్లి ఐటీ పార్క్ లో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అన్నిరకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకొవచ్చు. దేశ ప్రధాని మోదీతో పాటు, కేంద్ర బీజేపీ పెద్దలు కూడా చంద్ర బాబు ప్రమాణ స్వీకారాని రానున్నారు. ఉదయం 11.27 నిముషాలకు బాబు ప్రమాణ స్వీకారంచేయనున్నారు.

ఇప్పటికే చంద్రబాబు.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లను ప్రత్యేకంగా ఆహ్వనించారు. అంతేకాకుండా.. జూనియర్ ఎన్టీఆర్ కు సైతం ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రమ్మన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ కు, టీడీపీ కి మధ్య కొన్నేళ్లుగా గ్యాప్ ఏర్పడిందని గుస గుసలు విన్పిస్తున్నాయి. 

వీటిని జూనియర్ ఎన్టీఆర్ తరచుగా కొట్టిపారేస్తుంటారు. ఇక మరోవైపు చంద్రబాబు ఏపీలో అఖండ విజయం సాధించిన తర్వాఆ ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబుకు విషేస్ చెప్పారు. దీంతో మరల ఇద్దరు ఒక్కటయ్యారని అందరు సంబర పడ్డారు. దీనికి చంద్రబాబు రిప్లై కూడా ఇచ్చారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళమరోసారి .. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా బాబు ఫోన్ చేసి ఇన్ వైట్ చేశారంట. ఇప్పుడు దీనిపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు అవుతారా? లేదా? అనే విషయం మీద తీవ్ర చర్చ జరుగుతోంది.

ఎన్టీఆర్ గోవా పరిసర ప్రాంతాల్లో దేవర షూట్ లో బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయన వస్తారా..లేదా అన్న దానిపై మాత్రం ప్రస్తుతం సస్సెన్స్ కొనసాగుతుంది. మరోవైపు.. చిరంజీవి, రామ్ చరణ్ ఇప్పటికే చిరంజీవీ, రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అమిత్ షా కూడా ఇప్పటికే ఏపీకి చేరుకున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link