Kajal: చందమామలా మెరిసిపోయిన కాజల్..కొత్త ఫోటోలు చూశారా
కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
అక్కడి నుంచి వరస అవకాశాలు రావడంతో తెలుగులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కాజల్. స్టార్ హీరోలు, చిన్న హీరోలు అందరితో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.
తమిళంలో సైతం కొన్ని చిత్రాలు చేసి మెప్పించింది ఈ హీరోయిన్. ఇక సింగం హిందీ డబ్బింగ్ చిత్రంతో బాలీవుడ్లోకి సైతం అడుగుపెట్టింది.
అయితే కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని 2020లో పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. గత కొద్దిరోజుల నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిచనుంది.
ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో వైట్ గాగ్రాలో మెరిసిపోతూ కనిపించింది కాజల్.