Kajal Aggarwal: కాజల్ ఎంగేజ్‌మెంట్ వార్తల్లో నిజమెంత ?

Mon, 17 Aug 2020-10:30 pm,

కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) 2007లో లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా టాలివుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చుకుంది. తరువాత మగధీర లాంటి సినిమాతో టాలివుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలిచింది. టాలివుడ్‌లో టాప్ హీరోలందరి సరసన నటించింది కాజల్.

కాజల్ అగర్వాల్ త్వరలో వివాహం చేసుకోబోతోంది అని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal wedding ) పెళ్లి గురించి ఎప్పటికప్పుడు పుకార్లు షికార్లు చేస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు అవేవి నిజం కాలేదు. ఇదిలావుండగా తాజాగా మరోసారి కాజల్ పెళ్లి వార్తలు తెరపైకొచ్చాయి. 

ముంబైకి చెందిన గౌతమ్‌ అనే వ్యాపారవేత్తతో కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం ( Kajal Aggarwal engagement) జరిగినట్టు, ఈ యేడాది చివర్లో కాజల్ పెళ్లి జరగనున్నట్లు ఓ ప్రచారం వైరల్ అవుతోంది.   

కాజల్ అగర్వాల్ నిశ్చితార్థానికి ఆమె ఫ్రెండ్, కవచం, సీత చిత్రాల కోస్టార్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా హాజరయ్యారనేది ఆ ప్రచారం సారాంశం. 

తనకు ఎంగేజ్‌‌మెంట్ అయ్యిందని.. ఈ ఏడాది చివర్లో పెళ్లి కూడా కాబోతుందని వస్తున్న వార్తలపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ.. తనకు నిశ్చితార్థం అయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఖండించింది.

కాజల్ అగర్వాల్ అప్‌కమింగ్ చిత్రాల విషయానికొస్తే... భారతీయుడు-2 మూవీలో కమల్ హాసన్ సరసన, ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link