Kajal Aggarwal: బుద్దిచ్చింది.. ఇకపై వాటి జోలికి పోనంటున్న కాజల్ అగర్వాల్..
మ్యారేజ్ తర్వాత సర్వ సాధారణంగా ఎక్కువ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్టే. కానీ కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది హీరోయిన్స్ మాత్రం పెళ్లైన ఇప్పటికీ వరుస చిత్రాలతో బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తోంది.
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలైన ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది కాజల్ అగర్వాల్. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. కాజల్.. తాజాగా ‘సత్యభామ’ మూవీతో ఆడియన్స్ ను పలకరించింది.
సత్యభామ ఫ్లాప్ తో ఇకపై లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయోద్దని డిసైడ్ అయింది. ఒకవేళ చేసినా.. ఓటీటీ లో రిలీజయ్యే సినిమాలు మాత్రమే చేస్తానంటోంది. తాజాగా విడుదలైన సత్యభామ సినిమాకు కనీస ఓపెనింగ్స్ రాకపోవడంతో కాజల్ డిసప్పాయింట్ అయినట్టు తెలుస్తోంది.
అందుకే ఇకపై మహిళా ఇతివృత్తాలతో తెరకెక్కే చిత్రాల్లో నటించనని తెగేసి చెబుతోంది కాజల్ అగర్వాల్.
కాజల్ అగర్వాల్ గతేడాది ‘భగవంత్ కేసరి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అయినా.. ఈ సినిమా క్రెడిట్ మాత్రం బాలయ్య ఖాతాలోకే వెళ్లింది.
కాజల్ అగర్వాల్.. తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.