Kaju masala curry: జీడిపప్పుతో ఇలా మసాలా కూర చేస్తే.. రోటీల్లోకి భలే బాగుంటుంది..!
సాధారణంగా డ్రైఫ్రూట్స్‌లో విటమిన్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో అవసరం. అందుకే డైట్లో చేర్చుకోవాలని వైద్యులు కూడా చెబుతుంటారు. కొన్ని వంటల్లో జీడిపప్పు, పిస్తా, కిష్‌మిష్ వేసుకుని తయారు చేసుకుంటాం. ఇది వంట రుచిని మరింత పెంచుతుంది.
అయితే, రెస్టారెంట్లో కూడా ఎంతో ప్రత్యేకంగా వడ్డించే జీడిపప్పు మసాలా కూరను మీరు కూడా ఇంట్లో తయారు చేయాల్సిందే. దీనికి పెద్దగా ఏ ఆహార పదార్థాలు కూడా అవసరం లేదు.
జీడిపప్పు- అరకప్పు, ఉల్లిపాయలు-1, టమోటాలు -౩, నానబెట్టిన జీడిపప్పు-౩ స్పూన్లు, దాల్చిన చెక్క- ఒక ఇంచు, యాలకులు, లవంగాలు- చెరో రెండు, కారం- ఒక స్పూన్, బట్టర్-2 స్పూన్లు, కశ్మీరీ కారం -స్పూన్, ఉపు- రుచికి సరిపడా, నూనె- 4 స్పూన్లు, కసూరీ మేతీ- ఒక స్పూన్ గరం మసాలా- స్పూన్, పంచదార- పావు టీస్పూన్, నీళ్లు- కూర గ్రేవీకి కావాల్సినంత, కొత్తిమీర, కరివేపాకు, క్రీమ్- 2 స్పూన్లు, ధనియాల పొడి- స్పూన్
ముందుగా కడాయి తీసుకుని జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత జార్‌లోకి మసాలాలు జీడిపప్పుతోపాటు అన్ని తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టి నూనె వేయాలి.
అందులో బట్టర్ వేసి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. ఆ తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేయించాలి. టమోటాలు, కారం, కశ్మీరీ కారం, ఉప్పు, జిలకర్ర, ధనియాలు, గరంమాసాలా, పంచదార వేసి కలపాలి.
ఈ కూరను బాగా కలుపుతూ ఉండాలి. కాసేపటి తర్వాత నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసి కలపాలి. ముందుగా నూనెలో వేయించిన జీడిపప్పు కూడా ఇందులో వేసుకుని కలపాలి. ఆ తర్వాత కూరకు తగ్గినన్ని నీళ్లు పోయాలి.
ఓ ఐదు నిమిషాల తర్వాత ఇందులో మీకు కావాల్సిన నీరు పోసుకుని మరిగించుకోవాలి. పైనుంచి క్రీమ్, కొత్తిమీరా వేసి గార్నీష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కాజు మసాలా కర్రీ రెడీ అవుతుంది. దీన్ని చపాతీలోకి నంజుకుని తింటే ఆ రుచి వేరు.