Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..

Tue, 27 Aug 2024-6:35 am,

Kalki 2898 AD Hindi Box Office Collections:రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కు మంచి కథ  పడితే.. ఎలా ఉంటుందో రీసెంట్ గా ‘కల్కి 2898 AD’మూవీతో మరోసారి ప్రూవ్ అయింది. అంతేకాదు మన దేశంలో  బుక్ మై షోలో ఈ సినిమా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ తో పాటు నెట్ ఫ్లిక్స్  రెండింటిలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరోవైపు నెట్ ఫ్లిక్స్ లో మాత్రం హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ వెర్షన్ కూడా త్వరలో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ఇప్పటికే హిందీలో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ సినిమా హిందీ + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి  రూ. 85 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్  బిజినెస్ చేసింది. ఈ సినిమా రూ. 86 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా మొత్తంగా 149.85 కోట్ల షేర్ (రూ. 300 కోట్ల గ్రాస్) రాబట్టింది.

మొత్తంగా హిందీలో థియేట్రికల్ గా ఈ సినిమా రూ. 64.85 కోట్ల లాభాలను కొల్లగొట్టింది. ‘కల్కి 2898 AD’ సినిమా ఇప్పటి వరకు రూ. 1182 కోట్ల గ్రాస్ (రూ. 582 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టింది.

మొత్తంగా మీద అన్ సీజన్ లో విడుదలైన ‘కల్కి’ మూవీ  ఆకట్టుకునే కథ, కథనం ఉంటే.. ఏ సీజన్ అయినా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లతో కుమ్మేయచ్చని కల్కి మూవీ మరోసారి ప్రూవ్  చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link