Kalki Telangana Record: తెలంగాణ గడ్డపై ‘కల్కి’ మూవీ మరో రేర్ ఫీట్.. ఇది ప్రభాస్ రేంజ్..!

Tue, 03 Sep 2024-6:55 am,

కంటెంట్ ఉంటే అన్ సీజన్ అయినా.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టవచ్చని ‘కల్కి’ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా  విడుదలైన దాదాపు అన్ని ఏరియాల్లో కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది. కల్కి మేనియా తెలుగు చిత్ర సీమకే పరిమితం కాలేదు. నార్త్ బెల్ట్ లో ఈ సినిమా సంచలనం క్రియేట్ చేసింది. ఈ సినిమా హిందీ వెర్షన్ లో దాదాపు రూ. 300 కోట్ల నెట్ (రూ. 450 కోట్ల గ్రాస్) బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి.  

 

తెలుగు చిత్రసీమకు తెలంగాణ  ఏరియా గుండెకాయ వంటిది. ఇక్కడ తెలంగాణ ప్రజలతో హైదరాబాద్ ఏరియాలో అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. దీంతో సినిమాల పరంగా నైజాం ఏరియా  అత్యంత కీలకమైనది. ఇక్కడ ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీ రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

కల్కి సినిమా నైజాం ఏరియాలో రూ. 100 కోట్ల షేర్ (రూ. 185 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా తెలంగాణలో రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను గాను రూ. 35 కోట్ల వరకు బయ్యర్స్ కు లాభాలను తీసుకొచ్చింది.

మొత్తం అన్ సీజన్ లో అది కూడా ఎలాంటి  హాలీడేస్ లేకుండా విడుదలైన ‘కల్కి 2898 AD’ మూవీ తెలుగు స్టేట్స్ తో మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 215 కోట్లకు పైగా షేర్ అందుకుంది. అంతేకాదు అంతేకాదు ఒక్క తెలంగాణ (నైజాం) ఏరియాలో ఈ సినిమా మంచి హోల్డ్ తో లాంగ్ రన్ రాబట్టింది.

 

మరోవైపు ఈ సినిమా $ 20 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ ఈ చిత్రం మన కరెన్సీలో రూ. 140 కోట్ల షేర్ (రూ. 280 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. అంతేకాదు బాహుబలి 2 తర్వాత ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది.

ఓవరాల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్ల గ్రాస్ (రూ. 582 కోట్ల షేర్) రాబట్టినట్టు మూవీ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా థియేట్రికల్ గా ఈ సినిమా రూ. 180 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link