Kalki Record: నైజాం గడ్డపై ‘కల్కి’ మూవీ మరో రికార్డు.. ఇది రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ రాపేంజ్..

Thu, 25 Jul 2024-11:16 am,

ఏ సమయంలో‘కల్కి’ మూవీ రిలీజైందో విడుదలైన దాదాపు అన్ని ఏరియాల్లో ప్రభంజనం క్రియేట్ చేస్తుంది.  కల్కి మేనియా తెలుగు చిత్ర సీమకే పరిమితం కాలేదు. హిందీ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా అప్రతిహతంగా దూసుకుపోతుంది. ఇప్పటికే మన దేశంలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 275 కోట్ల నెట్ వసూళ్లతో మంచి ఊపు మీదుంది. 

తెలుగు చిత్రసీమకు నైజం ఏరియా అత్యంత కీలకమైనది. ఈ ఏరియాలో ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీ రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా 27 రోజుల్లో ఈ సినిమా ఇక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది.

 

మొత్తం అన్ సీజన్ లో అది కూడా ఎలాంటి  హాలీడేస్ లేకుండా విడుదలైన ‘కల్కి 2898 AD’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులుపుతోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమా రూ. 168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 185 కోట్లకు పైగా షేర్ అందుకొని ఎక్స్ లెంట్ హోల్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఒక్క తెలంగాణ (నైజాం) ఏరియాలో ఈ సినిమా మంచి హోల్డ్ తో లాంగ్ రన్ రాబట్టింది.

మరోవైపు ఈ సినిమా $ 19 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ ఈ సినిమా మన కరెన్సీలో రూ. 140 కోట్ల షేర్ (రూ. 222 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. అంతేకాదు బాహుబలి 2 తర్వాత ఓవర్సీస్ లో అత్యధిక వసూల్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.

తెలంగాణలో ఈ సినిమా రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కు గాను  రూ. 90 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా నైజాం గడ్డపై ఈ సినిమా రూ. 25 కోట్ల లాభాలను రాబట్టింది.

ఓవరాల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1150 కోట్ల గ్రాస్ (రూ. 555 కోట్ల షేర్) రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా థియేట్రికల్ గా ఈ సినిమా రూ. 151 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా తెలంగాణ సహా మిగిలిన ఏరియాల్లో రాబోయే రోజుల్లో ఈ సినిమా  ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link