Kangana ranaut: చెంపదెబ్బతో కంగానాకు వెల్ కమ్.. మోదీ ప్రమాణ స్వీకారం వేళ మరోసారి తెరపైకి ఆ వివాదం..
కేంద్రంలో మోదీ తన మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. బీజేపీకి ఊహించినంతగా మెజారిటీ రాకపోవడంతో తమ మిత్రపక్షాలపై ఆధార పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ 16, జేడీయూ నితీష్ కుమార్ 12, మోదీ ప్రభుత్వానికి కీలకంగా మారారు.
ఇదిలా ఉండగా ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి బీజేపీ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ భారీమెజారిటీతో గెలుపొందారు. దీంతో ఆమె ఢిల్లీకి వెళ్లడానికి చంఢీగడ్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అప్పుడు ఆమెకు ఊహించనిఘటన ఎదురైంది. అక్కడ చెకింగ్ విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కంగానా రనౌత్ ను దూశించుకుంటూ, చెప్పదెబ్బ కొట్టింది.
ఈ ఘటనతో కంగానా ఒక్కసారిగా షాకింగ్ కు గురైంది. కంగానా గతంలో ఢిల్లీ రైతు ఉద్యమాల సమయంలో రైతులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ తెలిపారు. కొందరు రైతులు వంద, రెండు వందలు తీసుకుని ఉద్యమంలో ఉన్నారని అన్నారు..
రైతు ఉద్యమం ముసుగులో ఖలీస్తాని ఉగ్రవాదులు ఉన్నారంటూ కంగానా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు జరిగిన ఉద్యమంలో తన తల్లి, తన వాళ్లు ఉన్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తాను ఎంతగానో మనస్థాపానికి గురయ్యానని అందుకు ఇలా కొట్టినట్లు కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెప్పుకొచ్చారు.
ఇక మరోవైపు కంగానా రనౌత్ దాడి ఘటనపై స్పందించారు. ఒక సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ తనపై దాడచేసిందని, అన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఒక కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉండి, కాబోయేఎంపీ పై దాడిచేయడం అమానుషమన్నారు.
దీన్ని బట్టి చూస్తే పంజాబ్ లో శాంతి భద్రతలు ఎంత అదుపులో ఉన్నాయో అర్ధమవుతుందన్నారు. పంజాబ్ లో ఉగ్రవాదం పెరుగుతున్నందుకు తనకు ఆందోళనగా ఉందన్నారు. దీనిపై హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సెక్యూరిటీ ఇలా చేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, మోదీ పీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే వేళ రైతుల ఉద్యమం ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
కిసాన్ మజ్దూర్ మోర్చా కు చెందిన నేతలు.. కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ కు సపోర్ట్ చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో కంగానా..శేఖర్ సుమన్ కొడుకు పై ఆరోపణలు చేయడం వల్ల అతను సూసైడ్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా.. రితిక్ రోషన్ పై కూడా ఆరోపణలు చేసిందన్నారు.