Bollywood stars Indian holiday diary : మనదేశంలోని హాలీడే స్పాట్స్‌లో ఎంజాయ్ చేసిన బాలీవుడ్ భామలు
మన బి-టౌన్ స్టార్స్ మాల్దీవులు, లండన్ లేదా ఏదో ఒక యూరోపియన్ దేశానికి వెళ్లడం మనం చూస్తుంటాం. కానీ కొందరు తారలు మన భారతీయ ప్రకృతిని ఆస్వాదిస్తారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో పాటు దేశంలోని పలు అందమైన ప్రదేశాల్లో ఎంజాయ్ చేసేందుకు వెళ్తుంటారు బాలీవుడ్ స్టార్స్.
గల్లీ బాయ్ ఫేమ్ ఎంసీ షేర్.. సిద్ధాంత్ చతుర్వేది ఉత్తర భారతదేశంలోని పర్వతాల్లో విహరించిండు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిండు. బుల్లెట్ బండిపై డుగ్ డుగ్‌మంటూ వెళ్లూ మస్త్ ఎంజాయ్ చేసిండు.
ఇక కునాల్ కెమ్ము ఏకండా బైక్ మీదే లేహ్-లద్దాఖ్ వరకు వెళ్లాడు.
కరీనా కపూర్ ఖాన్, మలైకా అరోరా గతేడాది ధర్మశాలకు వెళ్లారు. అక్కడ వారు భూత్ పోలీస్ సినిమా షూటింగ్ పాల్గొన్నారు. ఆ సమయంలో బెబో.. హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్ లో ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా గడిపింది.
ట్రిప్స్ కు వెళ్లడంతో జాన్వీ కపూర్ ముందుంటారు. తనకు ఏమాత్రం ఖాళీ సమయంలో దొరికినా హాలీడే స్పాట్స్ లో వాలిపోతుంటుంది ఈ భామ. ఇక ఆ మధ్య జాన్వీ కపూర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి ముస్సోరీలో ఎంజాయ్ చేసింది.
ఫాతిమా సనా షేక్ కూడా ట్రావెలింగ్‌ను బాగా ఇష్టపడతారు. ఆమె ఆ మధ్య ధర్మశాలలో ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా స్టిల్ ఇచ్చింది.