Karisma kapoor: స్నేహితుడితో పడుకోమని కరిష్మా కపూర్‌ని బలవంతం చేసిన భర్త..హానీమూన్‌లో లైంగిక వేధింపులు
ప్రస్తుతం సంజయ్ కపూర్..మూడో పెళ్లి చేసుకున్నాడు. ప్రియా సచ్‌దేవ్‌ని వివాహమాడాడు.
సంజయ్ కపూర్‌కు విడాకులిచ్చిన తరువాత తన బిడ్డను స్వయంగా పోషించసాగింది కరిష్మా కపూర్. తన ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది. పిల్లల కోసం కరిష్మా కపూర్..సంజయ్ కపూర్ ఇద్దరూ తమ చేదు అనుభవాల్ని పక్కనబెట్టి..సాధారణంగా ఉండసాగారు.
కరిష్మా కపూర్ తండ్రి రణ్‌ధీర్ కపూర్ కూడా సంజయ్ కపూర్‌ని థర్డ్‌క్లాస్ మనిషిగా విమర్శించిన పరిస్థితి. ఎప్పుడూ మద్యం మత్తు, జల్సాల్లో మునిగుండేవాడని మండిపడ్డారు.
అంతే కాదు..కేవలం సంజయ్ మాత్రమే కాదు..అతని తల్లి కూడా కరిష్మాను కొడుతుండేది. పెళ్లి సందర్బంగా చాలాసార్లు కరిష్మా కపూర్..డొమెస్టిక్ వయోలెన్స్‌కు గురైంది. కరిష్మాతో పెళ్లైన తరువాత కూడా సంజయ్ తన మొదటి భార్యతో సంబంధం కొనసాగించాడు. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండేవాడు.
తన పెళ్లికి సంబంధించి అత్యంత నీచమైన వ్యధల్ని ఓ ఇంటర్వ్యూలో కరిష్మా చెప్పినప్పుడు అందరూ నిర్ఘాంతపోయారు. ఆమె జీవితంలో పెళ్లైనప్పటి నుంచే సంజయ్...కరిష్మాను టార్చర్ చేయడం ప్రారంభించాడు. కరిష్మా కపూర్..తన భర్త సంజయ్‌తో హానీమూన్‌కు వెళ్లింది. తన స్నేహితుడితో పడుకోవాలని సంజయ్ బలవంతం చేశాడని కరిష్మా చెప్పింది.
పెళ్లైన తరువాత ప్రతిరోజూ వేధింపులు, సమస్యల్ని తట్టుకోలేకపోయింది కరిష్మా. 2016లో పెళ్లి పెటాకులైంది. కేవలం 13 ఏళ్లు నడిచిన వైవాహిక జీవితంలో కరిష్మా దుర్భర జీవితాన్ని చవిచూసింది. 2012 నుంచే కరిష్మా విడిగా ఉండసాగింది. సంజయ్‌తో వివాహం కరిష్మాను చాలా వేధించింది. ఈ పెళ్లికి సంబంధించి అత్యంత దుర్భరమైన అనుభవం..హానీమూన్ నాడు ఆమెను అవమానపర్చడం
కరిష్మా కపూర్ రెండుసార్లు ప్రేమలో మోసపోయిందని తెలుస్తోంది. తరువాత ఆమె సంజయ్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. సంజయ్ కపూర్ మొదటి భార్యకు విడాకులిచ్చిన తరువాత కరిష్మాను రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత కరిష్మా ఢిల్లీలో సంజయ్‌తో పాటు వినసించసాగింది. ఈ వివాహం కరిష్మా జీవితంలో పెనుమార్పుల్ని తీసుకొచ్చింది.