Karkataka 2025: కర్కాటక రాశివారికి 2025 సంవత్సరం ఎలా ఉంటుంది? ఆ ఒక్క విషయంలో జాగ్రత్తపడకపోతే..?
2025లో ఈ రాశివారు ఏ పనితలపెట్టిన జరుగుతాయి. కొత్త సంబంధాలు మొదలవుతాయి. విద్యలో విజయం, కొద్దికాలంగా పడుతున్న బాధాలకు విముక్తి లభిస్తుంది.
పెళ్లికానివారికి పెళ్లి జరుగుతుంది. శత్రువులు మిత్రువులుగా మారతారు. కొత్త పనులు చేపడతారు. అనుకోకుండా ధనలాభం కలుగుతుంది. ఎన్నో రోజులనుంచి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.
ఇల్లు, కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 2025 మంచి లాభాలు పొందుతారు. సంతానం అభివృద్ధి చెందుతారు. శని వల్ల కొత్త వృత్తిలో విజయం పొందుతారు.
వ్యాపారంలో అభివృద్ధి. విహారయాత్రకు వెళ్తారు. బంధువుల నుంచి విభేదాలు తొలగిపోతాయి. మొత్తానికి కొత్త ఏడాది ఉల్లాసంగా కలుగుతుంది. సమాజ సేవ చేస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి కూడా చక్కటి విజయాలు కలుగుతాయి.
సమాజంలో గౌరవం పొందుతారు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. 2025 కర్కాటక రాశి వారికి తిరుగుండదు. ఉద్యోగులు ప్రమోషన్ వస్తుంది. మీ పేరుప్రఖ్యాతలు పెరుగుతాయి.
పని ప్రదేశంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి యోగం తెచ్చే కాలం. వీరికి పదవి ఖాయం. డబ్బు ఖర్చు పెరుగుతుంది. మీకు తిరుగు ఉండదు.
కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా జాక్‌పాట్ కొడతారు. 2025 ద్వీతీయార్థంలో కర్కాటక రాశివారు పుంజుకుంటారు. క్రీడారంగంలో ఉన్నవారికి కూడా మంచి కాలం.