Nayanthara VS Dhanush: గుర్తు పెట్టుకో.. వడ్డీతో సహా వస్తుంది.. సంచలనంగా మారిన నయన తార పోస్ట్.. అసలేం జరిగిందంటే..?
హీరో ధనుష్, నయనతారల మధ్య కొన్ని రోజులుగా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమన్న విధంగా మారి పోయిందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే ఇద్దరు కూడా నువ్వేంత అంటే.. నువ్వేంత అన్న విధంగా ముందుకు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నట్లు తెలుస్తొంది.
కొన్నిరోజుల క్రితమే.. నయన తార బియాండ్ ది ఫెయిరీ టేల్ కు గాను.. `నానుమ్ రౌడీ దాన్` డాక్యుమెంటరీ నుంచి మూడు సెకన్లను ఉపయోగించుకున్నారు. దీనికి నిర్మాత ధనుష్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో తన పర్మిషన్ లేనిదే.. ఇలా చేశారని.. ధనుష్.. కేవలం మూడు సెకన్ల నిడివి క్లిప్ కోసం.. ఏకంగా.. రూ. 10 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తు నోటీసులు జారీ చేశాడు.
దీంతో నయన్.. తన ఇన్ స్టాలో ధనుష్ ఎలాంటి వాడో అంటూ.. పెద్ద పోస్ట్ ను షేర్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాత్రం వివాదం నడుస్తునే ఉంది. మరొవైపు ధనుష్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా..ఇటీవల మద్రాస్ హైకోర్టును సైతం ఆశ్రయించినట్లు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలో నయత్ తరపు లాయర్ మాత్రం కోర్టులో.. ఈ మూడు సెకన్లు.. డాక్యుమెంటరీలోవి కావని. కేవలం బీటీఎస్ కు సంబంధించినవి అన్నారంట. ఈ క్రమంలో ప్రస్తుతం కోర్టు కేసు మాత్రం పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తొంది.
ఇదిలా ఉండగా.. ధనుష్ కోర్టులో కేసును వేయడంపై.. నయన తార మళ్లీ ఫైర్ అయ్యినట్లు తెలుస్తొంది. ఇటీవల ధనుష్, ఐశ్వర్య దంపతులకు కోర్టు డైవర్స్ ను మంజురు చేసింది. వీరి పెళ్లి 2004 లో జరిగింది. 2022 లో వీరిద్దరు తాము.. డైవర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విడాకుల కేసు నడుస్తునే ఉంది. తాజాగా, కోర్టు వీరికి డైవర్స్ మంజురు చేస్తు నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలో దీన్ని నయన తార ఇన్ డైరెక్ట్ గా ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటే..లేదా ఇబ్బందుల్లొ నెట్టాలని చూస్తే.. కర్మ వదిలి పెట్టదని.. వడ్డీతో సహా ఇచ్చేస్తుందని కూడా నయన తార పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇన్ డైరెక్ట్ గా.. ధనుష్ గురించి పెట్టిందనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. నయనతార పెట్టిన పోస్ట్ తో మళ్లీ వీరిద్దరి రచ్చ కాస్త వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.