Free bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు..?.. పండగ వేళ ఊహించని బిగ్ షాక్.. అసలేం జరిగిందంటే..?
ఇటీవల కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ లను ప్రారంభించింది. దీంతో ప్రతిరోజు మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణంను ఉపయోగించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో మహాలక్ష్మి పథకం, కర్ణాటకలో శక్తి పథకంగా మహిళలకు బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తున్నాయి. అయితే.. రెండు రాష్ట్రాలల కూడా మహిళల ఫ్రీబస్సు ప్రయాణానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తుంది.
ఇదిలా ఉండగా.. ఇటీవల కర్ణాటకలో కొంతమంది మహిళలు తాము టికెట్ లు కొని బస్సులో ప్రయాణిస్తున్నామని కూడా సోషల్ మీడియాలో పొస్ట్ లు పెట్టి ఆయనకు ట్యాగ్ లు చేశారు. దీంతో ఆయన ఇటీవల ఉచిత బస్సు ప్రయాణంపై కేబినెట్ లో మళ్లీ చర్చలుజరుపుతామని అన్నారంట.
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఐరావత క్లబ్ క్లాస్ 2.0 బస్సులను బుధవారం ప్రవేశపెట్టారు.ఈ నేపథ్యంలో.. డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా, ఈ–మెయిళ్ల ద్వారా చాలా మంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదించారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కర్ణాటకలో.. 2023 జూన్ 11న ఈ పథకాన్ని ప్రారంభించింది. అక్టోబర్ 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించినట్లు తెలుస్తొంది.
అయితే.. కొందరు మహిళలు టికెట్లకు డబ్బు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా.. కండక్టర్లు తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని డిప్యూటీ సీఎం అన్నట్లు తెలుస్తొంది.
కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో ఈ అంశంపై చర్చించి ఉచిత బస్సు ప్రయాణంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇటు తెలంగాణాలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుంది. ఇదిలా ఉండగా దీపావళి పండగ నేపథ్యంలో డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కొంత మంది మాత్రం.. తొందరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను తీసి వేస్తారని కూడా సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేస్తున్నారు. అయితే.. దీనిపై మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.