Katrina Kaif, Vicky Kaushal’s wedding : కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి అయిపాయె.. ఫ్యామిలీలు ఇంటికొచ్చె!
కొత్త పెళ్లి కూతురు కత్రినా కైఫ్ తల్లితో పాటు ఆమె తోబుట్టువులంతా జైపూర్ నుంచి తిరిగి వచ్చేశారు. కత్రినా కైఫ్ కుటుంబం అంతా ముంబైలోని విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల పెళ్లి డిసెంబరు 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో జరిగింది. ఆ పెళ్లికి వీరంతా హాజరయ్యారు.
కత్రినా కైఫ్ సోదరి ఇసాబెల్లె కైఫ్ విమానాశ్రయంలో ఇలా ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో తళుక్కుమంది.
కత్రినా తల్లి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. కత్రినా తల్లి సుజానేతో పాటు కత్రినా సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ కూడా ఉన్నారు.
కత్రినా పెళ్లికి వెళ్లి వచ్చిన బంటీ బాబ్లీ 2 ఫేమ్ శర్వరీ వాఘ్ ఇలా తళుక్కుమంది. వింటర్ వేర్ లో ఎంతో అందంగా ఉంది ఈ భామ
తన పార్టనర్‌తో కలిసి విమానాశ్రయంలో కనిపించిన సిమ్రాన్ కౌర్ ముండి
తన భర్తతో కలిసి తెల్లటి టీషర్ట్‌లో కత్రినా సోదరి నటాచా