Keerthy Suresh Pic : దసరా వర్కింగ్ స్టిల్స్.. కీర్తి సురేష్‌ పిక్స్ వైరల్

Tue, 25 Apr 2023-12:39 pm,

దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వంద కోట్ల క్లబ్బులో నాని దసరా సినిమా చేరింది. రా అండ్ రస్టిక్‌గా వచ్చిన దసరా అందరినీ మెప్పించింది.

దసరా సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేష్‌ కనిపించిన తీరు, నటించిన విధానానికి అంతా ఫిదా అయ్యారు. ఈ రెండు పాత్రలు బాగానే హైలెట్ అయ్యాయి.

ఇక వెన్నెల పాత్రలో అయితే కీర్తి సురేష్ అందరినీ ఆకట్టుకుంది. సెలెబ్రేషన్ ఆఫ్ వెన్నెల అంటూ బరాత్ సీన్‌లో కీర్తి సురేష్‌ వేసిన స్టెప్పులు అందరినీ ఊపేశాయి.

కీర్తి సురేష్‌కు సంబంధించిన చాలా సీన్లు ఎడిటింగ్‌లో లేపేసినట్టు కనిపిస్తోంది. అయితే తాజాగా షేర్ చేసిన వర్కింగ్ స్టిల్స్ చూస్తుంటే చాలా మంచి సీన్లే ఎడిటింగ్‌లో పోయినట్టు అనిపిస్తోంది.

కీర్తి సురేష్‌కు మహానటి తరువాత మళ్లీ అంత పేరు దసరా సినిమాతోనే వచ్చింది. ఆమె పర్ఫామెన్స్, లుక్స్, డ్యాన్స్ ఇలా ప్రతీ ఒక్కటి ట్రెండ్ అయింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link