Keerthy Suresh: పెళ్లైన కొద్దిరోజులకే కీర్తి సురేష్‌కు బిగ్ షాక్.. పాపం మహానటికి ఇలా జరిగిందేంటి?
కీర్తి సురేష్ 'మహానటి' సినిమాలో ఆమె నటనకు ఎంతో మంచి ఫిదా అయ్యారు. కీర్తి సురేష్ తెలుగు తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించారు.
కీర్తి సురేష్ నటనకు ఆమెకు నేషనల్ అవార్డు, సైమా అవార్డులను కూడా అందుకుంది. బడా హీరోల పక్కన నటించిన ఘనత.
తాజాగా ఈ అమ్మడు తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ నెలలోనే వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఫోటోల్లో కీర్తీ సురేష్ సంప్రదాయబద్ధంగా కనిపించారు.. పట్టు చీరలో హిందూ సంప్రదాయంలో ఆమె కనిపించారు. దీనికి తగ్గట్టుగా ఆమె కట్టూ బొట్టో కనిపించింది.
కీర్తి సురేష్ పెళ్లికి ఇండస్ట్రీలోని పెద్దలు చాలామంది వెళ్లారు. ఈమె పెళ్లి గోవాలో జరిగింది. మొదట హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు.
ఈ పెళ్లిలో కీర్తి సురేష్ తెల్లని వెడ్డింగ్ గౌన్ ధరించింది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ అయ్యారు. తన భర్త ఆంటోనీ తట్టిల్‌కు లిప్ లాక్ కూడా చేసుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఓ బడా హిందీ సినిమా నుంచి కీర్తి సురేష్ ను తప్పించారనే వార్త వినిపిస్తుంది. ఈ సినిమాపై కీర్తి సురేష్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారట. ఇది తన బాలీవుడ్ కెరీర్‌కు పెద్ద బాట వేస్తుందని అనుకుంటున్నారట. ఈ సమయంలో ఈ భారీ ప్రాజెక్టు నుంచి కీర్తి సురేష్‌ను తీసివేయడం బిగ్ షాక్ అని నెట్టింట వైరల్ అవుతోంది.