Keerthy Suresh: సమంత కావాలని ఇరికించింది..!.. పెళ్లయ్యాక షాకింగ్ నిజం రివీల్ చేసిన కీర్తి సురేష్.. మ్యాటర్ ఏంటంటే..?
కీర్తిసురేష్ తన చిన్న నాటి మిత్రుడు ఆంటోని తట్టిల్ ను ఇటీవల గోవాలో పెళ్లి చేసుకున్నారు. అంతే కాకుండా.. హిందు, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఈ అమ్మడు రెండు మార్లు పెళ్లి చేసుకున్నారు.
పెళ్లయ్యాక కూడా.. కీర్తిసురేష్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా బేబీజాన్ మూవీ ప్రమోషన్ ల కోసం బైటకొచ్చేశారు. మంగళ సూత్రంతోనే హాట్ గా కన్పిస్తు హల్ చల్ చేశారు.
ఇదిలా ఉండగా.. బేబీజాన్ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న అభిమానుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా.. కీర్తిసురేష్ ఈ మూవీలో తనకు చాన్స్ ఏవిధంగా దొరికిందో సీక్రెట్ రివీల్ చేసినట్లు తెలుస్తొంది.
బేబీ జాన్ మూవీ తమిళ మూవీ తేరీకి రీమేక్. తమిళ్ లో .. ఈ సినిమాలో సమంత నటించారు. అయితే.. హిందిలో ఈ మూవీకి ఎవరు బాగుంటారని మూవీ యూనిట్ సామ్ ను అడగ్గానే.. వెంటనే కీర్తిసురేష్ పేరు చెప్పిందంట.
ఆమె అయితే..ఈ రోల్ కు న్యాయం చేస్తుందని కూడా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిందంట. దీంతో మూవీ యూనిట్ కీర్తిసురేష్ ను సంప్రదించగా.. సామ్.. నన్ను ఇరికించిందని తొలుత భయపడిందంట.
కానీ ఇదోక గొల్డేన్ అవకాశంగా భావించి.. చాలెంజింగ్ గా చేసిందంట కీర్తిసురేష్. అందుకే కీర్తిసురేష్ ఈ మూవీపై అంత హోప్ పెట్టుకున్నట్లు తెలుస్తొంది. తనకు ఈ అవకాశం వచ్చేలా చేసిన సమంతకు మాత్రం కీర్తిసురేష్ థ్యాంక్స్ అంటూ తాజాగా చెప్పినట్లు తెలుస్తొంది.