Keerthy Suresh: వామ్మో.. మహనటి కాదు.. ‘మహా నాటీ’.... కీర్తి సురేష్ అంత పనిచేసిందా? సోషల్ మీడియాలో రచ్చ..
కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో ఈ భామ దూసుకుపోతుంది. కీర్తిసురేష్ మహానటి సినిమాతో ఒక రేంజ్ లో గుర్తింపు పొందారని తెలుస్తోంది.
అదే విధంగా ఒక వైపు తన అందం, అభినయంతో ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. ఇటీవల కల్కీ మూవీకి బుజ్జి కారుకు తన వాయిస్ కూడా ఇచ్చారు. కల్కీ మూవీకి బుజ్జీ హైలేట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇటీవల కీర్తీ సురేష్ కు చెందిన అనేక వార్తలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె సీక్రెట్ గా లవర్ తో డేటింగ్లో ఉన్నారని, తొందరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని కూడా తెలుస్తోంది.
అయితే.. కీర్తిసురేష్ మాత్రం.. గురించి వస్తున్న రూమర్స్ లను కొట్టిపారేస్తున్నారు. ఒకవైపు సినిమాలో బిజీగా ఉంటునే మరోవైపు సోషల్ మీడియాలో సైతం కీర్తిసురేష్ యాక్టివ్ గా ఉంటారు. ఆమె తరచుగా ట్రెండ్ గా అవుతుంటారు.
దసరా మూవీతో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో అవార్డు అందుకుని అందర్ని షాక్ కు గురిచేశారు. ఈ భామ ప్రస్తుతం తమిళం, మళయాళం, హింది సినిమాల్లో కూడా నటిస్తున్నారు. మహానటిలో అయితే అచ్చం సావిత్రిలాగా నటించి అందరి మన్ననలను పొందారు.
కిర్తీసురేష్ రజినీ కాంత్ కు చెల్లెలుగా, చిరంజీవికి చెల్లెలుగా కూడా నటించారు. ఆమె ఒకవైపు ఫ్యామిలీ ఓరి యెంటెడ్ సినిమాలు తీస్తునే, మరోవైపు ట్రెండ్ కు తగ్గట్టుగా మంచి రోల్ లను చూజ్ చేసుకుంటున్నారు.
ఇటీవల రిలీజైన రఘూతాతా మూవీలో కూడా కీర్తి సురేష్ తనదైన టాలెంట్ తో ఆడియన్స్ ను కట్టిపారేశారు. కీర్తిసురేష్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ, ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆమెకు చెందిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)