Keerthy Suresh: పూర్తిగా మారిపోయిన కీర్తి సురేష్.. గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేసిన మహానటి..
కీర్తి సురేష్ తల్లిదండ్రైలన సురేశ్, మేనక ఇద్దరు సినీ రంగానికి చెందిన వారు కావడంతో ఈమె బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత మలయాళ మూవీ 'గీతాంజలి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.
ఆ తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' మూవీతో అక్కడ కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తెలుగులో కీర్తి సురేష్ మొదటి సినిమా 'నేను శైలాజా'. రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌కు చేరువైంది.
తెలుగులో కాస్త పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీలో సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిన తీరుకు అందరు సలామ్ కొట్టారు. ఈ సినిమాలోని నటనకు మహానటికి జాతీయ ఉత్తమ నటి అవార్డు ఈమెను వెతుక్కుంటూ వచ్చింది.
లాస్ట్ ఇయర్ తెలుగులో నాని సరసన దసరా మూవీతో హిట్ అందుకుంది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' మూవీలో చిరు చెల్లెలు పాత్రలో నటించింది. 'భోళా శంకర్' సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.
ఇక మహేష్ బాబు సరసన పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
తాజాగా ‘కల్కి’ మూవీలో ప్రభాస్.. బుజ్జి కారుకు తన గాత్రాన్ని అందించింది. కీర్తి సురేష్ గాత్రం మరింత వన్నె తెచ్చింది.
ఇప్పటి వరకు సౌత్ సినీ సహా అన్ని ఇండస్ట్రీస్‌లో నటించిన కీర్తి సురేష్.. త్వరలో 'బేబి జాన్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన 'తేరి' మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది.